Vijay Deverakonda speech in Kingdom Pre Release Event
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 31న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. లోపల భయం ఉంది. కానీ ఓ తృప్తి కూడా ఉంది అని అన్నారు. ఈ సినిమా అందరిని సంతోషపెడుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
Sathi Leelavathi : మెగా కోడలు లావణ్య కొత్త సినిమా.. ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్..
‘ఫ్యాన్స్‌ను కలిసినప్పుడు అన్నా మనం కొడుతున్నాం అని అంటున్నారు. నా చిత్రం బాగా ఆడాలని దేవుళ్లని మొక్కుతున్నారు. సినిమా వల్లే నేను మీకు పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను. మీరంతా నా నుంచి కోరుకుంటున్న హిట్ కింగ్‌డమ్ నుంచి రాబోతుందని.’ అని దేవరకొండ తెలిపారు.
తన సంగీతంతో అనిరుధ్ ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లాడన్నారు. నిర్మాత నాగవంశీ బెస్ట్ ఔట్ ఫుట్ రావడం కోసం ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఇది విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కాదని.. గౌతమ్, అనిరుధ్, నాగవంశీ, నవీన్ నూలి.. వీళ్లందరి సినిమా అని విజయ్ దేవరకొండ అన్నారు.
సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదని, మంచి మనిషి అన్నారు. షూటింగ్ సమయంలో తనకు నిజంగానే అతడు సోదరుడిగా అనిపించాడని చెప్పారు. వెంకటేష్ చాలా బాగా నటించాడని, భవిష్యత్తునే పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.