Vijay Deverakonda : నన్ను ఎవ్వడూ ఆపేదేలే.. తిరుపతి యాసలో స్పీచ్ అదరగొట్టిన విజయ్ దేవరకొండ..

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తిరుపతి యాసలో మాట్లాడి అలరించాడు.

Vijay Deverakonda

Vijay Deverakonda : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జులై 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది. నేడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తిరుపతి యాసలో మాట్లాడి అలరించాడు.

Also Read : Jr NTR : ఇంటిని రీ ఇన్నోవేషన్ చేయించిన ఎన్టీఆర్.. ఇంటీరియర్ టీమ్ తో ఫొటోలు..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నా. మన తిరుపతి ఏడుకొండల స్వామి ఈ ఒక్కసారి మన పక్కన ఉంటే చాలా పెద్దోడ్ని అవుతా. పోయి టాప్ లో కూర్చుంటా. ప్రతిసారి లాగా కష్టపడి పనిచేశా. ఈ సారి సినిమాని చూసుకోడానికి గౌతమ్, నవీన్ నూలి, అనిరుద్, నాగవంశీ ఉన్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే ఉంది. వీళ్లంతా ఇంకా సినిమా కోసం పనిచేస్తున్నారు. మిగిలింది రెండే. ఆ వెంకన్న స్వామి దయ, మీ ఆశీస్సులు. ఈ రెండూ నాకు ఉంటే నన్ను ఎవ్వడూ ఆపేదేలే. 31వ తారీఖున మిమ్మల్ని థియేటర్లో కలుస్తున్నా అని అన్నారు.

Also Read : Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..