Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..

ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామని తీసుకొచ్చారు.

Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..

Vishwambhara

Updated On : July 26, 2025 / 3:54 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూట్ లో ఉన్నాడు. పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిన్నే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో స్పెషల్ సాంగ్ షాట్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ కూడా వేశారు. భీమ్స్ సంగీతం అందించిన స్పెషల్ సాంగ్ కి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో నాగిని సీరియల్ తో ఫేమ్ తెచ్చుకొని పలు సినిమాలు, సీరియల్స్ తో పాపులర్ అయిన మౌని రాయ్ ని ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకొచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియాలో మౌని రాయ్ రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవుతూనే ఉంటుంది.

Also Read : Kingdom : 200 ఏళ్ళ క్రితం పాత జైల్లో షూట్.. విజయ్ సినిమాకు శ్రీలంక ఆర్మీ ఎంత సపోర్ట్ చేసిందో తెలుసా?

ఈ సినిమాతో మౌనీ రాయ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి చిరు – మౌనీ రాయ్ కాంబో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సాంగ్ షాట్ అయ్యాక ఓ రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో విశ్వంభర షూట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

 

Also Read : Athadu Sequel : ‘అతడు’ సీక్వెల్ కి అవకాశం ఉంది.. నిర్మాత కామెంట్స్.. వాళ్ళు డేట్స్ ఇస్తారా?