Athadu Sequel : ‘అతడు’ సీక్వెల్ కి అవకాశం ఉంది.. నిర్మాత కామెంట్స్.. వాళ్ళు డేట్స్ ఇస్తారా?

అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది.

Athadu Sequel : ‘అతడు’ సీక్వెల్ కి అవకాశం ఉంది.. నిర్మాత కామెంట్స్.. వాళ్ళు డేట్స్ ఇస్తారా?

Athadu Sequel

Updated On : July 26, 2025 / 2:58 PM IST

Athadu Sequel : మురళీ మోహన్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు – త్రిష జంటగా తెరకెక్కిన అతడు సినిమా రిలీజయినప్పుడు యావరేజ్ గా నిలిచినా తర్వాత క్లాసిక్ సినిమా అయింది. అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అతడు పార్ట్ 2 తెరకెక్కించే ఆలోచన ఉందా, ఎవరితో తీస్తారు అని మీడియా ప్రతినిధులు మురళీ మోహన్ ని ప్రశ్నించారు.

Also Read : Athadu : ‘అతడు’ సినిమాలో చూపించిన ఇల్లు ఏమైపోయిందో తెలుసా? అలా ప్లాన్ చేద్దాం అనుకుంటే.. పాపం..

మురళీ మోహన్ సమాధానమిస్తూ.. అతడు పార్ట్ 2 తీస్తే మళ్ళీ అదే డైరెక్టర్, హీరోతోనే తీస్తాను. ఇంకొకరిని మార్చను. మారిస్తే జనాలు ఒప్పుకోరు. హీరో గారు, త్రివిక్రమ్ గారు డేట్స్ ఇచ్చి చేద్దాం అంటే జయభేరి సంస్థ నిర్మిస్తుంది. సీక్వెల్ కి అవకాశం ఉంది కథలో. అప్పట్లో పార్ట్ 2లు లేవు కాబట్టి అంతటితో ఆగిపోయింది. తీస్తే ఇప్పటికి మంచి సబ్జెక్టు అవుతుంది. మంచి కాంబినేషన్ కూడా. రీ రిలీజ్ చూసి ఫ్యాన్స్ అంతా కూడా పార్ట్ 2 రావాలని కోరితే డెఫినెట్ గా తీస్తాం అని అన్నారు.

అతడు సినిమా చివర్లో పూర్తి ఎండింగ్ ఇవ్వకుండానే వదిలేస్తారు. ఆ కేసుని ఎలా క్లోజ్ చేసారు, హీరో మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాడా? అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు అని సందేహాలు ఉంటాయి. మరి అక్కడి నుంచి కథ మొదలుపెట్టి సీక్వెల్ నిజంగానే ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Also Read : Balakrishna : పవన్ సినిమా వదిలేసిన డైరెక్టర్ తో.. బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?