Athadu : ‘అతడు’ సినిమాలో చూపించిన ఇల్లు ఏమైపోయిందో తెలుసా? అలా ప్లాన్ చేద్దాం అనుకుంటే.. పాపం..
అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మురళి మోహన్ మాట్లాడుతూ

Athadu
Athadu : మహేష్ బాబు అతడు సినిమా థియేటర్స్ లో రిలీజయినప్పుడు యావరేజ్ గా నిలిచినా ఆ తర్వాత క్లాసిక్ సినిమాలా మిగిలింది. ఇప్పటికి మహేష్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు అతడు సినిమా ఒక మంచి జ్ఞాపకం. ఇప్పుడు టీవీలలో అతడు సినిమా వేసినా మంచి రేటింగ్ తెచ్చుకుంటుంది. అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నేడు ప్రెస్ మెట్ నిర్వహించారు. నిర్మాత మురళి మోహన్ ఈ సినిమా ప్రెస్ మీట్ కి హాజరయ్యారు.
అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మురళి మోహన్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అతడు సినిమాలో షూటింగ్ చాలా భాగం వరకు ఒక ఇంట్లోనే జరుగుతుందని తెలిసిందే. అయితే ఆ ఇల్లు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సెట్ వేశారు.
Also See : Mirai : ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్.. వైబ్ ఉంది బేబీ..
మురళీ మోహన్ మాట్లాడుతూ.. అతడు సినిమా క్లైమాక్స్ ని 28 రోజులు షూటింగ్ చేసాం. యూకే నుంచి స్పెషల్ కెమెరాలు తెప్పించాం. క్లైమాక్స్ కోసం స్పెషల్ సెట్ వేసాము. రిలీజయినప్పుడు కమర్షియల్ గా లాభాలు రాకపోయినా మంచి పేరు వచ్చింది. మాకు హైదరాబాద్ అవుతల ఉన్న స్థలంలో హౌస్ సెట్ వేసాము. పెద్ద రిచ్ హౌస్ లాగా సెట్ వేసాము. అతడు సినిమా చాలా వరకు ఆ ఇంట్లోనే షూట్ జరిగింది. ఆ తర్వాత సెట్ చాలా మందికి నచ్చడంతో అలాగే ఉంచితే అందులో వేరే సినిమాల షూటింగ్స్ చేసుకున్నారు. దాంతో ఆ ఇల్లు అలాగే ఉంచి చుట్టూ డెవలప్ చేసి స్టూడియో కడదాం అనుకున్నాం. నిర్ణయం కూడా తీసుకున్నాం. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఆ స్థలం నుంచే వెళ్ళింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థలం, ఆ ఇల్లు గవర్నమెంట్ కి రింగ్ రోడ్ కోసం ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఇల్లు, స్థలంతో పాటు నావి 15 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లో పోయాయి. అందుకే స్టూడియో కట్టలేకపోయాను అని తెలిపారు.