Kingdom : 200 ఏళ్ళ క్రితం పాత జైల్లో షూట్.. విజయ్ సినిమాకు శ్రీలంక ఆర్మీ ఎంత సపోర్ట్ చేసిందో తెలుసా?

ఈ ఇంటర్వ్యూలో శ్రీలంక షూట్ గురించి తెలిపాడు డైరెక్టర్.

Kingdom : 200 ఏళ్ళ క్రితం పాత జైల్లో షూట్.. విజయ్ సినిమాకు శ్రీలంక ఆర్మీ ఎంత సపోర్ట్ చేసిందో తెలుసా?

Kingdom

Updated On : July 26, 2025 / 3:33 PM IST

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో జులై 31న రాబోతున్నాడు. నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, గౌతమ్, సందీప్ రెడ్డి వంగ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఇక కింగ్డమ్ సినిమా షూటింగ్ వైజాగ్ లోని ఓ ఐలాండ్ లో, శ్రీలంకలో, హైదరాబాద్ లో వేసిన సెట్ లో జరిగింది. ఈ ఇంటర్వ్యూలో శ్రీలంక షూట్ గురించి తెలిపాడు డైరెక్టర్.

Also Read : Athadu Sequel : ‘అతడు’ సీక్వెల్ కి అవకాశం ఉంది.. నిర్మాత కామెంట్స్.. వాళ్ళు డేట్స్ ఇస్తారా?

డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. శ్రీలంక ప్రసిడెంట్ ఇల్లు పక్క రోడ్డులోనే మాకు షూటింగ్ కి అనుమతి ఇచ్చారు. రోడ్ బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసారు. వాళ్ళ దేశంలో టూరిజం పెరగాలని మాకు చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళ ఆర్మీ బాగా కోపరేట్ చేసారు. వాళ్ళు మీకు ఎన్ని ట్యాంకర్లు కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి అని అడిగి మరీ ఇచ్చారు. ఆర్మీ వాళ్ళు స్వయంగా అవి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మాకు ఇచ్చారు.

శ్రీలంకలో కాండీ అనే సిటీలో 200 ఏళ్ళ క్రితం పాత జైలు ఉంది. దాన్ని హోటల్ లాగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడే రీ ఇన్నోవేషన్ పనులు మొదలుపెట్టారు. మేము వెళ్తే మాకు షూటింగ్ ఇచ్చారు. అది చాలా న్యాచురల్ గా ఉండేది లొకేషన్. సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఆ లొకేషన్ లోనే తీసాము. హీరో జైలుకు వెళ్లి బయటకు వచ్చేవరకు 13 నిమిషాల సీన్ ఉంటుంది. అదంతా ఆ జైలు లోనే తీసాము. ఆ సీన్ మొత్తం కంటిన్యూ రెయిన్ లోనే తీసాము. మా షూటింగ్ అయ్యాక వేరే సినిమా కోసం అడిగితే అది రీ ఇన్నోవేషన్ పూర్తి కావొచ్చింది అని ఇవ్వమన్నారు అని తెలిపారు.

Also Read : Athadu : ‘అతడు’ సినిమాలో చూపించిన ఇల్లు ఏమైపోయిందో తెలుసా? అలా ప్లాన్ చేద్దాం అనుకుంటే.. పాపం..