Vijay Deverakonda step in Family Star Nandanandanaa song gone viral
Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. సమ్మర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్.. గ్లింప్స్, సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఏం రిలీజ్ చేసినా.. అది నెట్టింట వైరల్ గా మారిపోతుంది. గ్లింప్స్ లో విజయ్ చెప్పిన ‘ఐరనే వంచాలేంటి’ అనే డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. ఆ డైలాగ్ ని అనేక రకాలుగా ఎడిట్ చేసి నెట్టింట ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నుంచి ఫస్ట్ సాంగ్ ‘నందనందన’ రిలీజ్ కాగా.. అందులో విజయ్ వేసిన స్టెప్పులు కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆ స్టెప్స్ ని కూడా అనేక వీడియోలుగా ఎడిట్ చేస్తూ వైరల్ అవుతున్నారు.
Also read :Yatra 2 : ‘యాత్ర 2’ మూవీ రివ్యూ.. తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం పోరాడిన కొడుకు కథ..
నందనందన అంటూ సాగే ఆ లవబుల్ సాంగ్ ని జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఇక ఈ సాంగ్ కోసం జానీ మాస్టర్ ఓ హుక్ స్టెప్ ని డిజైన్ చేశారు. స్టెప్ అంటే ఏదో పెద్ద పెద్దవి అనుకోకండి. ఆ స్టెప్ ఏంటంటే.. మనం మన చేతులతో జుట్టుని దువ్వుకుంటూ ఉంటాము. దానినే జానీ మాస్టర్ స్టెప్ చేసేశారు. పుష్ప సినిమాలో ‘శ్రీవల్లి’ సాంగ్ కోసం చెప్పు స్టెప్పుని డిజైన్ చేసి నేషనల్ వైడ్ వైరల్ అయ్యేలా చేశారు జానీ మాస్టర్.
ఇప్పుడు ఈ జుట్టు దువ్వుకునే స్టెప్పు కూడా అలానే ఫేమస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక స్టెప్ చూసిన కొందరు మీమర్స్.. ఆ స్టెప్ ని షాంపూ యాడ్‌కి, ఇతర మూవీ సాంగ్స్ కి యాడ్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ స్టెప్ గురించి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ.. ‘వైరల్ అవ్వాలంటే ఐరనే వంచాలేంటి, జుట్టు దువ్వుకున్నా సరిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Asalu aa Step Adhi ra Babu??#FamilyStar pic.twitter.com/IxCvZrWL8x
— Pradeep Chowdary (@PradeepCh0wdary) February 8, 2024
Rey ???#NandaNandanaa
#Familystar#VijayDeverakondapic.twitter.com/H9bawIhNvG— Virosh trends (@rowdyrashmika) February 8, 2024
Chal Maar??
Ft #VijayDeverakonda ❤?#FamilyStar ? #NandaNandanaa ? pic.twitter.com/I0mkmuucO4
— ? ? ? ? ? (@mr_rowdi) February 8, 2024
Song avg unna kuda ni steps tho @TheDeverakonda jaii ani paiki Vellindi movie mida hypee??#FamilyStar pic.twitter.com/yRRuwh0uW1
— The Revanth (@Revanth__7) February 8, 2024
Perfect ????#VijayDeverakonda #FamilyStarpic.twitter.com/SulYMoyN0t
— ᴛᴇɴᴀʟɪ ᴠɪᴊᴀʏᴀᴅᴇᴠᴀʀᴀᴋᴏɴᴅᴀ ғᴄ™ (@tenalivdfc) February 8, 2024
Oyaayiye…Ayiye…..?#VijayDeverakonda #FamilyStar #FamilyStarOnApril5th pic.twitter.com/6m0pj6Yp4J
— ???? ????? ?? (@AdithyaKandhula) February 8, 2024
Halimithi Habiboo pic.twitter.com/qe3ApWdDZe
— Hemanth Raj (@thehemanthraj) February 7, 2024