Shanmukha Priya : తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు రౌడీ స్టార్ సర్‌ప్రైజ్ విషెస్..

‘ఇండియన్ ఐడల్ 2021’ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్‌ప్రైజ్ చేశారు..

Vijay Deverakonda Surprise Wishes To Shanmukha Priya

Shanmukha Priya: ఈ ఆదివారం (ఆగస్టు 15) న జరగబోయే పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘‘ఇండియన్ ఐడల్ 2021’’ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్‌ప్రైజ్ చేశారు.

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

ఇండియన్ ఐడల్ షోలో ఓ తెలుగమ్మాయి ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. తను ‘‘విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్ అనీ, విజయ్ సినిమాలో పాడటమే తన కోరిక అని ఇంతకు ముందు షో నిర్వాహకులకు తెలిపింది షణ్ముఖ ప్రియ. అందుకే సోనీ టీవి వాళ్లు విజయ్‌ను షణ్ముఖకు విషెస్ తెలపాలని కోరారు. వెంటనే విజయ్ దేవరకొండ ఓ వీడియోతో ప్రోగ్రామ్ జరగుతున్నప్పుడే షణ్ముఖ ప్రియను సర్‌ప్రైజ్ చేశారు.

Indian Idol 12 : ఉత్కంఠంగా మారిన ఫైనల్స్.. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియపైనే ఆశలు..

తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా, టైటిల్ గెలిచినా, గెలవకపోయినా.. తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియో చూడగానే షణ్ముఖ ప్రియ, వాళ్ల పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. షోలో ఉన్న కంటెస్టెంట్‌లు, గెస్ట్‌లు, ప్రేక్షకులు అంతా షణ్ముఖకు విజయ్ ఆఫర్ ఇవ్వటాన్ని అభినందించారు.