Indian Idol 12 : ఉత్కంఠంగా మారిన ఫైనల్స్.. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియపైనే ఆశలు..

షణ్ముఖ ప్రియ గెలుపు కోసం తెలుగు వారు, మ్యూజిక్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..

Indian Idol 12 : ఉత్కంఠంగా మారిన ఫైనల్స్..  తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియపైనే ఆశలు..

Shanmukha Priya

Updated On : July 28, 2021 / 9:06 PM IST

Indian Idol 12: దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండియన్ ఐడల్ సీజన్ – 12 ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ గెలుపు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టాప్ 6లో ఉన్న షణ్ముఖ ప్రియ ఆగస్టు 15న జరిగే ఫైనల్స్‌కు చేరిపోయినట్లే. షో నిర్వాహకులు ఇప్పుడు ఎలిమినేషన్స్ ఆపేసి ముగ్గురు మేల్, ముగ్గురు ఫీమేల్ సింగర్స్‌తో ఫైనల్స్‌కు వెళ్లనున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం.

తెలుగమ్మాయి గెలుపుకోసం..
ఇప్పటి వరకు ముగ్గురు ఫీమేల్ సింగర్స్ ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచారు. మరి ఈసారి కూడా ఫీమేల్ సింగరే టైటిల్ విన్ అవుతారా..? విన్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తన బ్యూటిఫుల్ వాయిస్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న షణ్ముఖ ప్రియ ఫైనల్ వరకు వెళ్లింది. దీంతో గెలుపు తన వశమవుతుందా అని తెలుగు వారు, మ్యూజిక్ లవర్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Shanmukha Priya

 

ప్రేక్షకుల ప్రశంసలే ప్రైజులు..
శ్రీనివాస కుమార్, రత్నమాల దంపతుల గారాలపట్టి షణ్ముఖ ప్రియ. వైజాగ్, మధురవాడలో నివాసముంటున్నారు. ఒక్కత్తే కూతురు కావడంతో చిన్నప్పటి నుండే తన ఇష్టాలను ప్రోత్సహించారు పేరెంట్స్. అలా బహు భాషల్లో చిన్నానాటి నుండే పాటలు పాడడం ప్రాక్టీస్ చేసింది షణ్ముఖ ప్రియ. ఎన్నో టీవీ షోలలో పార్టిసిపెట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు లెక్కలేనన్ని ప్రైజులు గెలుచుకుంది.

Shanmukha Priya

 

ఇంటర్ నుండి ఇండియన్ ఐడల్‌కు..
18 ఏళ్ల షణ్ముఖ ప్రియ ఇంటర్ పూర్తి చేసింది. తన టాలెంట్‌ను దేశానికి చాటిచెప్పడానికి ఇండియన్ ఐడల్‌కు వెళ్లింది. సీజన్ – 12లో అద్భుతంగా పాడుతూ ఆడియన్స్ అండ్ జడ్జెస్‌ను ఆకట్టుకుంది. తెలుగు వారు ‘షణ్ముఖ ప్రియ మా తెలుగమ్మాయే’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది. షణ్ముఖ ప్రియ ఇప్పటివరకు పాడింది వేరు. ఇప్పుడు ఇండియన్ ఐడల్‌‌లో పాడబోయేది వేరు. ఒక్కసారి ఆ స్టేజ్ ఎక్కితే ఆ క్రేజ్, గెలిస్తే వచ్చే గుర్తింపే వేరు. అలాంటిది భారీ కాంపీటీషన్ ఎదుర్కుని ఫైనల్స్ వరకు రావడం అంటే చిన్న విషయం కాదు. తనతో పాటు టాప్ 6లో ఉన్న ఫీమేల్ సింగర్స్ అరుణిమ, సాయిలీ.. మేల్ సింగర్స్ పవన్ దీప్, మహమ్మద్ దానిష్, నిహాల్.. గట్టిపోటీనిస్తున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా బాగా పాడి షణ్ముఖ ప్రియ ‘ఇండియన్ ఐడల్‌’ టైటిల్ విన్ అవ్వాలని తెలుగు వారు, సంగీతాభిమానులు కోరుకుంటున్నారు.

Indian Idol 12