Vijay Fans Disappointed with Tamilnadu Government Decision regarding Leo Movie
Vijay : తమిళనాడులో(Tamil Nadu) హీరో విజయ్ స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ లో అక్కడ విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. విజయ్ సినిమా వచ్చిందంటే తమిళనాడు థియేటర్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేస్తారు. దసరా కానుకగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలకి పర్మిషన్ అడిగారు. మొదట కొన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన ఇప్పుడు అవి కూడా క్యాన్సిల్ చేసేసింది తమిళనాడు గవర్నమెంట్. ఇటీవల లియో ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేశారు. గతంలో రెహమాన్ కాన్సర్ట్ కి భారీ జనాలు రాగా వచ్చిన నష్టంతో లియో ఆడియో లాంచ్ కూడా క్యాన్సిల్ చేశారు. దీనిపై విజయ్ అభిమానులు నిరాశలో ఉన్నారు.
తాజాగా విజయ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. లియో సినిమాకు ఎలాంటి బెనిఫిట్, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి లేదు అని నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఎవరైనా అభిమానులు థియేటర్స్ యజమాన్యాలని బెదిరించి షోలు వేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అలాగే థియేటర్స్ లో మౌలిక వసతులు ఉండాలని, థియేటర్స్ బయట ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దని, పోలీసులు సినిమా రిలిజ్ రోజు అన్ని థియేటర్స్ పర్యవేక్షిస్తారని నోటీసుల్లో తెలిపారు. దీంతో విజయ్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
BREAKING: As reported earlier, In new GO today,
Government DENIES permission for 4 AM & 7 AM shows for #Leo film.
Government REMOVES "Thalapathy Vijay" from the order.
Government says Joseph Vijay's #LeoFilm can… pic.twitter.com/WFvuthZkdj
— Manobala Vijayabalan (@ManobalaV) October 13, 2023