Vijay Lokesh Kanagaraj Leo movie pre release business gets double margin
Vijay – Leo : తమిళ్ స్టార్ హీరో విజయ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లియో’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం, ఇప్పుడు ఈ చిత్రాన్ని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Tamannaah : ‘లస్ట్ స్టోరీస్-2’ అందరితో కలిసి చూడండి.. పేరు చూసి మోసపోకండి అంటున్న తమన్నా..
ఒక టీజర్ కూడా రిలీజ్ కి కాకముందే బడ్జెట్ కి డబల్ మార్జిన్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపు 220 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఇక థియేట్రికల్ రైట్స్ కూడా భారిస్థాయిలోనే సెల్ అయ్యినట్లు సమాచారం. తెలుగులో విజయ్ రీసెంట్ మూవీ ‘వారసుడు’ రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు లియో తెలుగు రైట్స్ 25 కోట్లు పలికినట్లు తెలుస్తుంది. ఇక కేరళలో 15 కోట్లకు సెల్ అయ్యినట్లు సమాచారం.
కన్నడలో వారసుడు మూవీ 8 కోట్లకు అమ్ముడుపోగా లియో మూవీకి 12 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని వినిపిస్తుంది. ఇక తమిళంలో ఈ మూవీ చిత్ర నిర్మాతలు సెవెన్ స్క్రీన్ స్టూడియో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారంటూ టాక్ వినిపిస్తుంది. తమిళంలో వారసుడు మూవీ 70 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి 100 కోట్ల బిజినెస్ జరగడంలో సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 422 కోట్లు జరిగింది. ఈ మూవీ బడ్జెట్ 275 కోట్లు దానికి దాదాపు డబల్ మార్జిన్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంటే సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.