Jana Nayagan : లాస్ట్ మూవీకి విజ‌య్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?

విజయ్ దళపతి జననాయకన్ మూవీపై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నానాటికి పెరుగుతున్నాయి.

Vijay remuneration for jana nayagan

విజయ్ దళపతి జననాయకన్ మూవీపై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నానాటికి పెరుగుతున్నాయి. విజయ్‌ 51వ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ తెగ ఆకట్టుకుంటోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఆయన లాస్ట్ సినిమా అని ఎప్పటినుంచో ప్రచారం ఉండటంతో ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. జననాయకన్‌ మూవీ ఫస్ట్ రోర్ ఫుల్ వైరల్‌ అవుతోంది.

అయితే ఈ సినిమాకు విజయ్‌ దళపతి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సౌత్‌లో ఇప్పటివరకు ఏ హీరో తీసుకోనంత పారితోషకం విజయ్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Maargan : ఎల్లుండే రిలీజ్‌.. యూట్యూబ్‌లో ఆరు నిమిషాల మూవీ..

జననాయకన్ మూవీ కోసం విజయ్ దళపతి రూ. 275 కోట్ల పారితోషికం తీసుకున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. KVN ప్రొడక్షన్స్ ఎలాంటి లాభాల భాగస్వామ్యం లేదా కోత లేకుండా పూర్తిగా ఈ భారీ మొత్తాన్ని విజయ్‌కు చెల్లించినట్లు టాక్. ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమాకు..ఒక హీరోకు రెమ్యూనరేషన్ చెల్లించడం సౌత్ ఇండియా ఫిల్మ్ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డు అని అంటున్నారు.

ఇప్పటివరకు సౌత్ స్టార్లలో ఎవరూ ఒకే సినిమాకు ఇంత పారితోషికం అందుకోలేదని టాక్. అల్లుఅర్జున్ పుష్ప-2 కోసం రూ.300 కోట్లు అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా రిపోర్ట్ చెప్పినప్పటికీ, విజయ్ రూ. 275 కోట్లు తీసుకోవటంతో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

COOLIE : రజనీకాంత్‌ ‘కూలీ’ నుంచి ‘చికిటు’ సాంగ్ వ‌చ్చేసింది..

జననాయకన్‌ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీ విజయ్‌కి రాజకీయంగా చాలా కూడా కీలకమైంది. అతని అభిమానులను ఉత్తేజపరిచే కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు గాసిప్స్‌ వైరల్ అవుతున్నాయి. ఈ భారీ రెమ్యూనరేషన్‌ మీద జరుగుతోన్న ప్రచారం విజయ్ సినిమాపై అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచుతుంది. పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ వంటి అద్భుతమైన తారాగణం నటించిన జననాయకన్‌ మూవీ.. జనవరి 9, 2026న సంక్రాంతికి ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.