×
Ad

Gandhi Talks : ‘గాంధీ టాక్స్’ మూవీ రివ్యూ.. మాటలు లేకుండా మూకీ సినిమా..

అసలు మాటలు లేకుండా మూకీ సినిమాగా ఈ గాంధీ టాక్స్ తెరకెక్కింది. (Gandhi Talks)

Gandhi Talks

Gandhi Talks : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, మహేశ్‌ మంజ్రేకర్, సిద్ధార్థ్‌ జాదవ్, జరీనా వహబ్‌.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా గాంధీ టాక్స్. జీ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో కిషోర్ పాండురంగ బేలేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కినది. అసలు మాటలు లేకుండా మూకీ సినిమాగా ఈ గాంధీ టాక్స్ తెరకెక్కింది. గాంధీ టాక్స్ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజయింది.(Gandhi Talks)

కథ విషయానికొస్తే..

ముంబై ధారావిలో కటిక దరిద్రంలో బతుకుతూ ఉంటాడు మహాదేవ్‌ విష్ణు (విజయ్‌ సేతుపతి). తన తల్లి ఆరోగ్యానికి, తన జాబ్ కి లంచం 50 వేలు, తను ప్రేమించిన అమ్మాయి(అదితి రావు హైదరి)ని పెళ్లి చేసుకోడానికి.. ఇలా అన్నిటికి డబ్బులు కావాలి. మరోవైపు బోస్‌మన్‌ (అరవింద్‌ స్వామి) ఓ పెద్ద వ్యాపారవేత్త. కొంతమంది అతన్ని మోసం చేయడంతో అతని వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతుంది. అతని ఫ్యామిలీని కూడా కోల్పోతాడు. బోస్‌మన్‌ ఆస్తులు జప్తు చేస్తారు. ఇన్వెస్టర్స్ అంతా అతన్ని డబ్బుల కోసం వేధిస్తుంటారు. బోస్‌మన్‌ కి కూడా డబ్బు కావాలి.

ఓ దొంగ బాగా బతుకుతుండటం, ఇంకో దొంగ(మహేష్ మంజ్రేకర్) రాజకీయ నాయకుడు అవ్వడంతో మహాదేవ్ తన కష్టాలు తీరడానికి దొంగతనం చేయాలని, అది కూడా బోస్‌మన్‌ ఇంట్లో దొంగతనం చేయాలని అనుకుంటాడు. మరి మహాదేవ్ విష్ణు దొంగతనం చేస్తాడా? అతనికి డబ్బులు వస్తాయా? తను ప్రేమించిన అమ్మాయి దక్కుతుందా? బోస్‌మన్‌ ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Om Shanti Shanti Shantihi : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..

సినిమా విశ్లేషణ..

పెద్ద సౌండ్స్, భారీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటే కానీ సినిమాలని పట్టించుకోని ఇలాంటి సమయంలో మూకీ సినిమా తీయాలనుకోవడం డేరింగ్ చేసినట్టే. సినిమాలో డైలాగ్స్ ఏమి లేవు కాబట్టి కథ అలా నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మహాదేవ్, బోస్‌మన్‌ కష్టాలు అన్ని చూపిస్తారు. అసలు మహాదేవ్ కష్టాలు చూస్తే వామ్మో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఇతనికే ఉన్నాయి అనే రేంజ్ లో దారుణంగా చూపిస్తారు. ఇంటర్వెల్ కి దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాక మహాదేవ్ ఏం చేస్తాడు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.

అయితే సెకండ్ హాఫ్ లో దొంగతనం ఎపిసోడ్ అక్కడక్కడే తిప్పి సాగదీశారు. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటి సమాజంలో డబ్బులు లేకుండా ఏ పని నడవదు అనే విషయాన్నీ దర్శకుడు చెప్పాలనుకున్నాడు. ప్రతి నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కాబట్టి గాంధీ టాక్స్ అని టైటిల్ పెట్టాడు. సినిమాలో కూడా డబ్బులను గాంధీ అనే చెప్పడం గమనార్హం.

డైలాగ్స్ లేకపోయినా ప్రతి సీన్ అర్థమయ్యేలా నటీనటులు నటించడం, దర్శకుడి స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని టెక్స్ట్ రూపంలో చూపించడంతో కథ అంతా ఈజీగానే అర్ధమవుతుంది. మనిషికి ఉన్న బాధలు, అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అనే ఎమోషన్, మెసేజ్ చెప్పారు ఈ సినిమాతో. డైరెక్టర్ రొటీన్ కథ తీసుకున్నా మూకీగా మంచి ప్రయోగమే చేసారు. ఓపిక ఉంటే ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, జరీనా వహబ్‌.. వీళ్లంతా ఆల్రెడీ నిరూపించుకున్న స్టార్స్. డైలాగ్స్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే నటించి కథని అర్థమయ్యేలా చెప్తాము అని ఈ గాంధీ టాక్స్ తో ప్రూవ్ చేసారు. ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు కూడా అంతే బాగా నటించారు.

Also Read : One/4 Review : ‘వన్ బై ఫోర్’ మూవీ రివ్యూ..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. కొన్ని ముంబై రియల్ లొకేషన్స్ లో రియాలిటీగా ఈ సినిమాని బాగానే చిత్రీకరించారు. ధారవి సెట్ కూడా రియల్ అనిపించేలా వేశారు. ఈ విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మెచ్చుకోవలసిందే. ఏ ఆర్ రహమాన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాటలు లేని ఈ మూకీ సినిమాకు ప్రాణం పోశారు.

డైలాగ్స్ లేకపోయినా పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. డబ్బు ముఖ్యం అనే రొటీన్ పాయింట్ ని మూకీగా స్టార్స్ ని పెట్టి బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘గాంధీ టాక్స్’ సమాజంలో అన్నిటికి, అందరికి డబ్బు అవసరం అనే పాయింట్ ని డైలాగ్స్ లేకుండా మూకీగా తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.