One/4 Review : ‘వన్ బై ఫోర్’ మూవీ రివ్యూ..
వన్ బై ఫోర్ సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(One/4 Review)
One/4 Review
One/4 Review : వెంకటేష్, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా వన్ బై ఫోర్. తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మాణంలో బాహుబలి పళని కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వన్ బై ఫోర్ సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(One/4 Review)
కథ విషయానికొస్తే..
వైజాగ్ లో కిరణ్(వెంకటేష్) చదువు అయిపోయి జాబ్ జాయిన్ అయ్యేలోపు కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేద్దామని తిరుగుతూ ఉంటాడు. కిరణ్ వాళ్ళ కాలనీలోనే పవిత్ర(హీనా సోనీ) తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. పవిత్ర భర్త దుబాయ్ లో ఉంటాడు. పవిత్ర కాలేజీ ఫ్రెండ్ ప్రొఫెసర్ గా వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయి రావడంతో అప్పుడప్పుడు ఫ్యామిలీలతో కలుస్తారు. మొదట పవిత్ర – ప్రొఫెసర్ బంధాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నా వీరిద్దరిది మంచి ఫ్రెండ్షిప్ అని తెలుసుకుంటాడు కిరణ్. ఓ ఘటనతో కిరణ్ కి బైక్ మెకానిక్(టెంపర్ వంశీ)తో పరిచయం ఏర్పడుతుంది.
ఆ బైక్ మెకానిక్, అతని ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఏదైనా వన్ బై ఫోర్ షేరింగ్ అంటూ డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఈ విషయం కిరణ్ కి తెలియనివ్వకుండా అతనితో క్లోజ్ అవుతారు. ఓ రోజు మందు సిట్టింగ్ లో కిరణ్ పవిత్ర మంచితనం గురించి చెప్పడంతో ఈ వన్ బై ఫోర్ టీమ్ పవిత్ర – ప్రొఫెసర్ కలిసి ఉన్న వీడియోలు తీసి తన భర్తకు పంపిస్తామని భయపెట్టి డబ్బులు తీసుకుంటారు. మరోసారి డబ్బులు అడిగి పవిత్రని రేప్ చేస్తారు ఈ నలుగురు. పవిత్ర ఈ విషయం ఎవరికైనా చెప్తుందా? పవిత్ర ఏం చేస్తుంది? కిరణ్ కి ఈ విషయం ఎలా తెలుస్తుంది? కిరణ్ ఆ నలుగురి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు? మధ్యలో కిరణ్ లవ్ స్టోరీ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : రేపే కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన..? తిథి, వార, నక్షత్రాలు.. అబ్బో అద్భుతః
సినిమా విశ్లేషణ..
ఫస్ట్ హాఫ్ అందరి పాత్రల పరిచయాలతోనే ఎక్కువ సాగుతుంది. లవ్ స్టోరీ కాస్త బోర్ కొడుతుంది. పవిత్రని వన్ బై ఫోర్ టీమ్ టార్గెట్ చేసిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు నుంచి కాస్త ఎమోషన్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషన్ ని పండించారు. ఇక రివెంజ్ కోసం హీరో ఏం చేసాడు అనేది కూడా ట్విస్ట్ తో మంచి స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకున్నారు.
తప్పుడు పనులు చేసే ఓ టీమ్.. హీరోకి సంబంధించిన వాళ్ళని ఏదో చేయడం దానికి హీరో రివెంజ్ తీర్చుకోవడం అనే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది. టెంపర్ వంశీ, అతని బ్యాచ్ తాగే సీన్స్ ఎక్కువగా సాగదీశారు. వాటిని చాలా వరకు కట్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా సాగిన ఇంటర్వెల్ ముందు నుంచి గ్రిప్పింగ్ గానే నడిపించారు. లవ్ స్టోరీ కూడా సింపుల్ గానే ఉంటుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. చివర్లో ఓ మంచి మెసేజ్ బాగానే ఇచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఆల్రెడీ కన్నడలో హీరోగా చేసిన వెంకటేష్ ఇప్పుడు వన్ బై ఫోర్ సినిమాతో తెలుగులో బాగానే మెప్పించాడు. హీనా సోనీ పవిత్ర పాత్రలో చక్కగా ఒదిగిపోయి ఎమోషన్ సీన్స్ ని బాగా పండించింది. అపర్ణ మల్లిక్ పర్వాలేదనిపిస్తుంది. టెంపర్ వంశీ విలన్ షేడ్స్ లో బాగానే నటించాడు. అపర్ణ శెట్టి, మధుసూధన రావు, సుహాని వ్యాస్, సునీత మనోహర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Om Shanti Shanti Shantihi : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లేని చోట కూడా హెవీగా ఇచ్చారు. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేయాల్సింది. పాత కథే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాలని ట్రై చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘వన్ బై ఫోర్’ ఓ చిన్న మెసేజ్ తో సాగిన సస్పెన్స్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
