Upasana : రేపే కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన..? రాముడు పుట్టిన నక్షత్రంలో పుట్టబోతున్న మెగా వారసులు..?
ఈసారి ఉపాసనకు కవలపిల్లలు పుట్టబోతున్నట్టు డబల్ హ్యాపినెస్ అంటూ చరణ్ హింట్ కూడా ఇచ్చాడు. (Upasana)
Upasana
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఆల్రెడీ 2023 లో ఒక పాప జన్మించింది. ఆ పాపకు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టారు. ఇప్పటిదాకా ఆ పాప ఫేస్ చూపించకపోయినా స్టార్ కిడ్ కావడంతో బాగా ఫేమస్ అయింది. అయితే ఉపాసన మళ్ళీ ప్రగ్నెంట్ అని గత సంవత్సరం దీపావళి సమయంలో ఆమె సీమంతం వీడియో ఒకటి షేర్ చేసారు.(Upasana)
ఈసారి ఉపాసనకు కవలపిల్లలు పుట్టబోతున్నట్టు డబల్ హ్యాపినెస్ అంటూ చరణ్ ఉపాసన సీమంతం వీడియో షేర్ చేసి గతంలోనే హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కవలలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఉపాసన రేపు జనవరి 31న కవలపిల్లలకు జన్మనివ్వనుందని మెగా సన్నిహితుల సమాచారం. దీంతో మెగా వారసులు వస్తున్నారు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Vishwak Sen : విశ్వక్ ఎంత మంచోడో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేసే ముందు తరుణ్ తో ఏమని చెప్పాడో తెలుసా?
ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే రేపు నక్షతరం ఏంటి, ముహుర్తాలు, తిథులు ఏంటి అని వైరల్ చేస్తున్నారు. హిందూ పంచాగం ప్రకారం రేపు జనవరి 31 శనివారం ఉదయం 7 గంటల 38 నిముషాల వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత చతుర్ధశి తిథి మొదలవుతోంది. ఆ రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు. త్రయోదశి శనికి సంబంధించిన పవర్ ఫుల్ తిథి అయితే చతుర్థశి శివుడికి ప్రియమైన తిథి. అలాగే రేపంతా కూడా పునర్వసు నక్షత్రమే. పునర్వసు నక్షత్రం శనివారం రాత్రి ఒంటిగంట 41 నిముషాల వరకు ఉంది. అంటే రోజు మొత్తం పునర్వసు నక్షత్రం ఉంది.
పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రం. రాముడు ఆ నక్షత్రంలోనే పుట్టాడు. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి అని తెలిసిందే. ఆంజనేయుడి ఆరాధ్య దైవం రాముడు. దీంతో మెగా ఫ్యాన్స్ రాముడు పుట్టిన నక్షత్రంలో వారసులు పుడుతున్నారు అని అంటున్నారు. సాధారణంగా పిల్లలు పుట్టాక ఏ నక్షత్రంలో జన్మించారో చూసి దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. అయితే పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఏ పాదంలో జన్మించినా మంచిదే, ఎలాంటి దోషం లేదు అని పండితులు చెప్తున్నారు.
Also Read : Om Shanti Shanti Shantihi : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు ఇంటర్నెట్ మాధ్యమాల నుంచి సేకరించబడింది. వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
