స్పిన్‌ మాంత్రికుడి బయోపిక్‌లో విజయ్ సేతుపతి!

  • Published By: sekhar ,Published On : October 9, 2020 / 10:36 AM IST
స్పిన్‌ మాంత్రికుడి బయోపిక్‌లో విజయ్ సేతుపతి!

Updated On : October 9, 2020 / 10:55 AM IST

Muthiah Muralidaran Biopic: శ్రీలంక క్రికెటర్‌, స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ సినిమాగా రాబోతోంది. తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి మురళీధరన్‌ పాత్ర పోషిస్తున్నారు. ‘800’ పేరుతో తమిళంలో మురళీధరన్‌ బయోపిక్‌ తీయనున్నట్లు గతేడాది వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఇప్పుడు మళ్లీ మొదలు పెడుతున్నారు.


ముత్తయ్య మురళీధరన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి పోషిస్తారని తెలియజేస్తూ చిత్రనిర్మాణ సంస్థ మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. తన పాత్ర పోషణ కోసం విజయ్‌సేతుపతి ముత్తయ్య మురళీధరన్‌ దగ్గర క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటారట.


ఎమ్ఎస్ శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మూవీ టీమ్ తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Muthiah Muralidaran Biopic