Allu Arjun – Vijay : అల్లు అర్జున్ సాంగ్‌కి విజయ్ స్టెప్పులు.. పూజా హెగ్డే షేర్ చేసిన వీడియో వైరల్!

విజయ్ బర్త్ డే సందర్భంగా పూజా హెగ్డే అభిమానులకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. విజయ్ తో కలిసి పూజా 'బీస్ట్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సెట్స్ లోని ఒక బ్యూటిఫుల్ వీడియోని..

Vijay steps to Allu Arjun Pooja Hegde Iconic step of Butta Bomma

Allu Arjun – Vijay : తమిళ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ బర్త్ డే నిన్న (జూన్ 22) కావడంతో అభిమానులు, తోటి నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నేడు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) విజయ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. విజయ్ తో కలిసి పూజా ‘బీస్ట్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సెట్స్ లోని ఒక బ్యూటిఫుల్ వీడియోని అభిమానులతో పంచుకుంది.

Ram Charan : పాప పుట్టాక మొదటిసారి మీడియా ముందు రామ్ చరణ్.. తన పోలికే అంటున్న చరణ్!

అల్లు అర్జున్ తో పూజా హెగ్డే ‘అలా వైకుంఠపురంలో’ నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో బన్నీతో కలిసి డాన్స్ చేసిన ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఆ పాట కోసం జానీ మాస్టర్ డిజైన్ చేసిన ఐకానిక్ స్టెప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బీస్ట్ సెట్ లో ఇద్దరి పిల్లలు కోసం విజయ్ ఆ స్టెప్పుని వేసి అదరగొట్టాడు. ఆ వీడియోని పూజా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘లియో’ (Leo) సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం, అలాగే ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుండడంతో ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న బర్త్ డే సందర్భంగా మూవీలోని ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేశారు. అనిరుష్ సంగీతం అందించిన ‘నా రెడీ’ అనే పాటని విజయ్ అండ్ అనిరుద్ కలిసి పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ తమిళ్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు.