Vijay thalapathy shocking comments on release of Jana nayagan movie.
Vijay Thalapathy: తమిళ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాలకు పూర్తిగా స్వస్తీ చెప్పేసి కేవలం రాజకీయాలలోనే బిజీగా ఉండనున్నాడు విజయ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నయగాన్’. తెలుగు బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు.
Amitov Teja: డైరెక్టర్ తేజ కొడుకుపై క్రిమినల్ కేసు.. కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు
పూజ హెగ్డే, మమిత బైజు ఫిమేల్ పత్రాలు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, సెన్సార్ అభ్యంతరాల కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు జన నాయగన్ సినిమా మరోసారి సెన్సార్ కి వెళ్లే అవకాశం ఉందట. సెన్సార్ సూచించిన అభ్యంతరాలను తొలగిస్తేనే విడుదల సాధ్యం అయ్యే అవకాశం ఉంది.
ఇక ఇదే విషయంపై తాజాగా కామెంట్స్ చేశాడు హీరో విజయ్(Vijay Thalapathy)..”నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకనుంచి పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతాను. సినిమాలు చేసే అవకాశం లేదు. కానీ, జన నాయగన్ సినిమా విషయంలో నా నిర్మాతలను చూస్తే బాధగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.