The Greatest of All Time : వినాయక చవితికి విజయ్ ‘GOAT’ వచ్చేస్తుంది.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం' సినిమా రిలీజ్ డేట్ ని నేడు ప్రకటించారు.

Vijay The Greatest of All Time Release Date Announced

The Greatest of All Time : తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) ఇటీవల పాలిటిక్స్ లోకి వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ బరిలో దిగాలని సిద్దమవుతూ ఈ లోపు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో AGS ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో విజయ్ హీరోగా విజయ్ 68వ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ అనే టైటిల్ ని గతంలో ప్రకటించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి విజయ్ డ్యూయల్ రోల్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఓ కథ కూడా వినిపిస్తుంది. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్ తో దూకేసాడు. ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికి దొరకలేదు. ఆ మిస్టరీని బేస్ చేసుకొని ఈ సినిమాని తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

Also Read : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ.. ఈ సారి ఏకంగా అయిదు దయ్యాలతో..

తాజాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమా రిలీజ్ డేట్ ని నేడు ప్రకటించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమాని తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు .సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి కూడా ఉండటంతో సినిమాకి కలెక్షన్స్ పరంగా మరింత కలిసొస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.