Vijay Theri movie re-releasing for sankranthi festival.
Vijay Thalapathy: తమిళ స్టార్ విజయ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. పూజ హగ్దే, మమిత ఫిమేల్ లీడ్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్(Vijay Thalapathy) నుంచి వస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూపులా గురించి ఎంత చెప్పినా తక్కువే.
Ananya Nagalla: పసుపు రంగు శారీలో పరువాల వల.. అనన్య గ్లామర్ రచ్చ.. ఫొటోలు
ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావాలి. కానీ, సెన్సార్ అభ్యంతరాల వల్ల ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడింది. సెన్సార్ ఈ సినిమాకు ముప్పైకి పైగా అభ్యంతరాలు తెలిపింది. ఆ సీన్స్ ని తొలగించాలని మూవీ టీంను కోరింది. కానీ, దానికి ఒప్పుకొని మూవీ టీం కోర్టును ఆశ్రయించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వెలువడనుంది.
అయితే, జనవరి 9న ఈ సినిమా విడుదల అవుతుంది అని చాలా ఆశలు పెట్టుకున్నారు విజయ్ ఫ్యాన్స్. కానీ, వాయిదా తరువాత చాలా డిజప్పాయింట్ అయ్యారు. కానీ, విజయ్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయడం ఇష్టం లేకపోవడంతో విజయ్ నటించిన తేరి సినిమాను ఈ పండగకి రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమా ను జనవరి 15న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. దీంతో, విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తేరి చిత్ర నిర్మాత కలైపులి తాను అధికారిక ప్రకటన చేశారు. మరి ‘జన నాయగన్’ కి బదులుగా వస్తున్న తేరి సినిమాకు విజయ్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
ஜனவரி 15 முதல் அகிலமெங்கும்
Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp
— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026