దీపావళి రేసు నుండి తప్పుకున్న ‘సంగ తమిళన్’

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. దివాళీ రేసు నుండి తప్పుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 05:38 AM IST
దీపావళి రేసు నుండి తప్పుకున్న ‘సంగ తమిళన్’

Updated On : May 28, 2020 / 4:00 PM IST

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. దివాళీ రేసు నుండి తప్పుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్స్.. విజయ్ చందర్ దర్శకత్వంలో బి.భారతి రెడ్డి నిర్మించారు. యాక్షన్, రొమాన్స్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ‘సంగమిత్రన్’, ‘తమిళరాసన్’ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఇదిలా ఉంటే తమిళనాట దీపావళికి విడుదల కానున్న ‘సంగ తమిళన్’ వాయిదా పడింది. కోలీవుడ్‌లో ‘దళపతి’ విజయ్ నటించిన ‘బిగిల్’, కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాలు ఈ దీపావళికి విడుదల కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 1000 థియేటర్లు ఉన్నాయి. 700 నుంచి 750 థియేటర్లలో ‘బిగిల్’ విడుదలయ్యే అవకాశం ఉంది. ‘ఖైదీ’ కూడా 200 నుంచి 250 థియేటర్లలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. దీంతో ‘సంగ తమిళన్’ వాయిదా పడక తప్పలేదు..

Read Also : నవంబర్ 8న శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’

ఈ సినిమా దాదాపు దివాళీ రేసు నుండి తప్పుకున్నట్టే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. నాజర్, శ్రీమాన్, సూరి, జాన్ విజయ్, అశుతోష్ రాణా, రవి కిషన్ తదితరులు నటించిన ‘సంగ తమిళన్’ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. కెమెరా : ఆర్.వేల్రాజ్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, సంగీతం : వివేక్ – మెర్విన్, రచన, దర్శకత్వం : విజయ్ చందర్.