భారత తొలి 32-బిట్ “విక్రమ్” సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్ ఇది.. మోదీకి అందజేత.. ఇకపై మనదేశం ఈ రంగంలో.. ఏపీలోనూ..
ప్రభుత్వం 6 రాష్ట్రాల్లో (గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) రూ.1.60 లక్షల కోట్లకు మించి పెట్టుబడితో 10 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.

Vikram processor
Vikram 32 bit processor: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025లో భారత తొలి 32-బిట్ “విక్రమ్” ప్రాసెసర్ చిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. అలాగే, ఇప్పటికే ఆమోదం పొందిన నాలుగు ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా అందించారు.
“కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ విజన్ వల్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించాము. కేవలం మూడున్నర ఏళ్లలోనే ప్రపంచం భారత్ వైపు నమ్మకంతో చూస్తోంది. నేడు ఐదు సెమీకండక్టర్ యూనిట్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. మేము ప్రధానికి తొలి ‘మేడిన్ ఇండియా’ చిప్‌ను అందజేశాము” అని వైష్ణవ్ అన్నారు.
గ్లోబల్ పాలసీ గందరగోళాన్ని, భారీ అనిశ్చితి సృష్టించిందని, ఇటువంటి సమయంలో భారత్ స్థిరంగా ముందుకు వెళుతోందని వైష్ణవ్ చెప్పారు. భారత్‌లో పాలసీలు స్థిరమైన రీతిలో ఉన్నాయని పెట్టుబడులు పెట్టాలని ఆయన అన్నారు.
“విక్రమ్” 32-బిట్ ప్రాసెసర్ అంటే ఏంటి?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సెమీకండక్టర్ ల్యాబ్ రూపొందించిన “విక్రమ్” భారతదేశపు తొలి స్వదేశీ 32-బిట్ మైక్రోప్రాసెసర్. కంప్యూటర్ లేదా డివైజ్ పని చేయడానికి ఆదేశాలను ప్రాసెస్ చేసేదాన్నే మైక్రోప్రాసెసర్ అంటారు. కఠినమైన లాంచ్ వెహికల్ పరిస్థితుల్లో ఉపయోగించడానికి దీనికి ఆమోదముద్ర పడింది.
పంజాబ్‌లో చిప్‌ల తయారీ ప్యాకేజింగ్
సెమీకండక్టర్ కంపెనీ సీజీ-సెమీ గుజరాత్‌లోని సణంద్‌లో ఓఎస్‌ఏటీ (ఔట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) పైలట్ సౌకర్యం నుంచి తొలి ‘మేడిన్ ఇండియా’ చిప్‌ను విడుదల చేయనుంది. 2023లో సణంద్‌లో సెమీకండక్టర్ యూనిట్ స్థాపనకు ప్రధాని మోదీ ప్రభుత్వం తొలి ప్రతిపాదనను ఆమోదించింది.
డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్‌ఐ) పథకం ద్వారా 23 చిప్ డిజైన్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. స్టార్టప్‌ల ఆవిష్కర్తలకు మద్దతుగా వీటిని ప్రభుత్వం ఆమోదించింది. వర్వ్‌సెమీ మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన వ్యవస్థల కోసం అధునాతన చిప్‌లు తయారు చేస్తున్నాయి. భారత్ చిప్‌ల సృష్టికర్త అని కూడా నిరూపించుకుంటోంది.
భారత ప్రభుత్వం 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) ప్రారంభించింది. కేవలం 3.5 ఏళ్లలో ఈ మిషన్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. (Vikram 32 bit processor)
ప్రస్తుతం ప్రభుత్వం 6 రాష్ట్రాల్లో (గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) రూ.1.60 లక్షల కోట్లకు మించి పెట్టుబడితో 10 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులను ఆమోదముద్ర వేసింది.
సెమీకండక్టర్లు ఆధునిక సాంకేతికతలో ప్రధాన భాగం. ఇవి ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష వ్యవస్థలను నడిపిస్తాయి. ప్రపంచం డిజిటలైజేషన్ ఆటోమేషన్ వైపు కదులుతున్న వేళ సెమీకండక్టర్లు ఆర్థిక భద్రత, వ్యూహాత్మకతకు అనివార్యమయ్యాయి.
First ‘Made in India’ Chips!
A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025