అన్ని ఫీచర్లు ఉండే “ప్రీమియం” స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ 6 ఫోన్లు ఇవే.. ఏదో ఒకటి కొనేయండి.. కిక్కెక్కుతుంది..
Best Mobiles: వన్‌ప్లస్ నోర్డ్ 5 ధర రూ.31,999, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో రూ.31,999, రియల్‌మీ జీటీ 7 రూ.39,999, రియల్‌మీ జీటీ 7టీ రూ.32,999, వివో V60 రూ.36,999, పోకో F7 రూ.31,999గా ఉన్నాయి.

Best Mobiles
Best Mobiles: అన్ని ఫీచర్లు ఉండే “ప్రీమియం” స్మార్ట్‌ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. రూ.30,000 నుంచి రూ.40,000 మధ్య ధరలో అటువంటి ఫీచర్లు ఉండే స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.
రూ. 40,000లోపు వచ్చే ముఖ్యమైన ఫోన్ల ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నోర్డ్ 5 రూ.31,999, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో రూ.31,999, రియల్‌మీ జీటీ 7 రూ.39,999, రియల్‌మీ జీటీ 7టీ రూ.32,999, వివో V60 రూ.36,999, పోకో F7 రూ.31,999గా ఉన్నాయి.
మోడల్ | ధర |
---|---|
వన్‌ప్లస్ నోర్డ్ 5 | రూ. 31,999 |
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో | రూ. 31,999 |
రియల్‌మీ జీటీ 7 | రూ. 39,999 |
రియల్‌మీ జీటీ 7టీ | రూ. 32,999 |
వివో వీ60 | రూ. 36,999 |
పోకో ఎఫ్7 | రూ. 31,999 |
వన్‌ప్లస్ నోర్డ్ 5
ఈ విభాగంలో తక్కువ ధరలో లభ్యమయ్యే ఫోన్ వన్‌ప్లస్ నోర్డ్ 5. వన్‌ప్లస్ డిజైన్‌లో మార్పు చేసింది. నోర్డ్ 4లో ఉన్న మెటల్ యూనిబాడీ కాకుండా గాజు అల్యూమినియం మిశ్రమాన్ని నోర్డ్ 5లో ఉపయోగించింది.క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 నుంచి శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్ చేసింది.
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో డిజైన్ ప్రత్యేకతంగా ఉంది. వన్‌ప్లస్ నోర్డ్ 5లాగే ఇది కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నోర్డ్ 5లా శక్తిమంతం కాకపోయినా, సరిపడా పనితీరు అందిస్తుంది. ఇది 3X టెలిఫొటో జూమ్ ఉన్న కెమెరా వ్యవస్థతో వచ్చింది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
రియల్‌మీ జీటీ 7, రియల్‌మీ జీటీ 7టీ
రియల్‌మీ జీటీ 7టి, జీటీ 7 యూజర్లను ఆకర్షిస్తున్నాయి. రెండింటికీ IP69 రేటింగ్ ఉంది. జీటీ 7లో మీడియాటెక్ 9400e ఎస్‌వోసీ ఉంది. 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో రెండూ వచ్చాయి. 120W ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంది. (Best Mobiles )
వివో V60
వివో V60 డిజైన్, బ్యాటరీ లైఫ్‌పై దృష్టి సారించింది. ఇతర ఫోన్ల ఫ్లాషీ డిజైన్‌లకు భిన్నంగా, వివో సున్నితమైన డిజైన్‌ను ఎంచుకుంది. రౌండెడ్ కార్నర్లు, సౌకర్యవంతమైన హోల్డ్‌తో వచ్చింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది.
పోకో F7
మీరు గేమింగ్ లేదా పర్ఫార్మన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే పోకో F7 సరిపోతుంది. సైబర్ సిల్వర్ ఎడిషన్‌లో వెనుక భాగం సెమీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ, పెద్ద వెపర్-చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఎక్కువసేపు గేమింగ్‌లో సమస్య ఉండదు.