భారత్‌లోకి Realme 15T వచ్చేసింది.. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఓర్నాయనో స్పెసిఫికేషన్లు ఎగిరిగంతులేసేలా ఉన్నాయ్.. డిస్కౌంట్..

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే కొన్ని బ్యాంకు కార్డుల ఈఎంఐ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లేదా పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ ఉంటుంది. 10 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ జీరో డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉంది.

భారత్‌లోకి Realme 15T వచ్చేసింది.. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఓర్నాయనో స్పెసిఫికేషన్లు ఎగిరిగంతులేసేలా ఉన్నాయ్.. డిస్కౌంట్..

Realme 15T Launched in India

Updated On : September 2, 2025 / 3:07 PM IST

Realme 15T launched in India: భారత్‌లో రియల్‌మీ 15టీ మంగళవారం విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. 60డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ఎస్ఓసీతో పనిచేస్తుంది, 12జీబీ ర్యామ్ వరకు ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. వేడి తగ్గించేందుకు 6,050 చదరపు మిల్లీమీటర్ల ఎయిర్‌ఫ్లో వెపర్ చాంబర్ (వీసీ) కూలింగ్ సిస్టమ్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లు ఉన్నాయి.

భారత్‌లో ధర, డిస్కౌంట్

రియల్‌మీ 15టీ ధర భారత్‌లో 8జీబీ + 128జీబీ వేరియంట్‌కి రూ.20,999 నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ వేరియంట్లు వరుసగా రూ.22,999, రూ.24,999గా ఉన్నాయి. ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం రంగుల్లో వస్తుంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌లో లభ్యమవుతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఈ స్టోర్, పలు ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి వస్తుంది.

Also Read: OnePlus 15లో ఫీచర్లు ఏం ఉన్నాయ్‌ మామా.. కళ్లుచెదిరిపోతున్నాయ్‌.. ఇక వన్‌ప్లస్ 14 రాదు?

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే కొన్ని బ్యాంకు కార్డుల ఈఎంఐ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లేదా పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ ఉంటుంది. 10 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ జీరో డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉంది. ప్రీ బుక్ చేసిన వారికి రియల్‌మీ బడ్స్ టీ01 టిడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్లు ఉచితంగా ఇస్తారు.

ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు కొన్ని బ్యాంకు కార్డులపై రూ.2,000 డిస్కౌంట్, రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ లభ్యమవుతుంది.

రియల్‌మీ 15టీ ఫీచర్లు

రియల్‌మీ 15టీ 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080×2,372 పిక్సెల్‌లు) 4ఆర్ కంఫర్ట్+ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది, గరిష్టంగా 4,000 నిట్స్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్ సపోర్ట్ ఉన్నాయి.

హ్యాండ్‌సెట్ 6ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ఎస్ఓసీతో పనిచేస్తుంది. 12జీబీ ఎల్పీడిడిఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వరకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6తో వస్తుంది.

రియల్‌మీ 15టీ బ్యాక్‌సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు వెనుక రెండూ 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. ఏఐ ఎడిట్ జీనీ, ఏఐ స్నాప్ మోడ్, ఏఐ ల్యాండ్‌స్కేప్ ఫీచర్లు ఉన్నాయి.