విజయ్‌కాంత్‌కి ‘కెప్టెన్’ బిరుదు ఎలా వచ్చింది..? రోజా భర్త వల్లే..

విజయ్‌కాంత్‌ ని అభిమానులు, అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. కెప్టెన్ విజయ్‌కాంత్‌ అనే అంతా ఇప్పటికి సంబోధిస్తారు. విజయ్‌కాంత్‌ కూడా కెప్టెన్ పేరు మీదే రెండు ఛానల్స్ కూడా ప్రారంభించారు. అంతగా కెప్టెన్ అనే పేరు బాగా పాపులర్ అయిపోయింది.

Captain Vijayakanth

Captain Vijayakanth : ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చికిత్స అందుకుంటూ నేడు ఉదయం చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. విజయ్‌కాంత్‌ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

విజయ్‌కాంత్‌ ని అభిమానులు, అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. కెప్టెన్ విజయ్‌కాంత్‌ అనే అంతా ఇప్పటికి సంబోధిస్తారు. విజయ్‌కాంత్‌ కూడా కెప్టెన్ పేరు మీదే రెండు ఛానల్స్ కూడా ప్రారంభించారు. అంతగా కెప్టెన్ అనే పేరు బాగా పాపులర్ అయిపోయింది.

అయితే విజయ్‌కాంత్‌ కి కెప్టెన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే.. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు విజయ్‌కాంత్‌. 80, 90ల్లో వరుస సినిమాలతో హిట్స్ కొట్టారు. ముఖ్యంగా విజయ్‌కాంత్‌ ఎక్కువగా పోలీస్ పాత్రల్లో, లీడర్ పాత్రల్లో నటించారు. 1991లో వచ్చిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ అనే కమర్షియల్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాని రోజా భర్త RK సెల్వమణి తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అభిమానులు, మీడియా విజయ్‌కాంత్‌ ని కెప్టెన్ అని సంబోధించడం మొదలుపెట్టాయి. దానికి తగ్గట్టే ఆయన పోలీస్, ఆర్మీ పాత్రలు ఎక్కువగా చేయడంతో విజయ్‌కాంత్‌ కి కెప్టెన్ బిరుదుగా ఫిక్స్ అయిపోయింది.

Also Read : Vijay Kanth: ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ కన్నుమూత..

అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు తమిళ్ ప్రజలు, మీడియా కూడా కెప్టెన్ విజయ్‌కాంత్‌ అనే సంబోధిస్తారు. నేడు తమ కెప్టెన్ మరణించడంతో అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కాంత్‌ ఉన్న మియాట్ హాస్పిటల్ కి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు