Vijay Kanth: ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ కన్నుమూత..

గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ కొన్ని నిమిషాల ముందే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Vijay Kanth: ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ కన్నుమూత..

Vijayakanth Passed Away

Updated On : December 28, 2023 / 2:41 PM IST

Vijay Kanth: నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చెన్నై MIOT ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులుగా విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పటికప్పుడు DMDK పార్టీ నేతలు ఆయన ఆరోగ్యంపై అప్డేట్ కూడా ఇస్తున్నారు.

గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ కొన్ని నిమిషాల ముందే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ కూడా చేరి, చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కెప్టెన్ గా సుపరిచితులైన 71 ఏళ్ల విజయ్‌కాంత్ తమిళలంలో అగ్ర హీరోగా వెలుగొందారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయి విజయం సాధించాయి.