Vijayashanthi : రెండు గంటలు బురదలో.. బాడీ వణికిపోయింది.. 58 ఏళ్ళ వయసులో సినిమా కోసం విజయశాంతి కష్టాలు..

తాజాగా మీడియాతో మాట్లాడారు విజయశాంతి.

Vijayashanthi Hardwork for Kalyanram Arjun Son of Vyjayanthi Movie

Vijayashanthi : ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా, లేడీ ఓరియెంటెడ్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది విజయశాంతి. తన సినిమాలతో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనిపించుకుని టాప్ హీరోయిన్ గా కొన్నాళ్ళు తెలుగు సినీ పరిశ్రమని రూల్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది.

దాంతో అందరి హీరోయిన్స్ లాగే విజయశాంతి రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తుంది అనుకున్నారు. కానీ అయిదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టి అప్పటి కర్తవ్యం విజయశాంతిని గుర్తుచేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది.

Also See : Sravanthi Chokarapu : శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న యాంకర్ స్రవంతి..

తాజాగా మీడియాతో మాట్లాడారు విజయశాంతి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి ఎంట్రీ సీన్ కి పవర్ ఫుల్ యాక్షన్ ఫైట్ ఉంటుంది. ఫైట్ చివర్లో విజయశాంతి బురదలో పడిపోతుంది. ఆ సీన్ గురించి, ఫైట్ గురించి చెప్పుకొచ్చారు.

విజయశాంతి మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత కర్తవ్యం, ఫైట్స్ చేసిన సినిమాలు చూడమన్నాను. ఆ సినిమాలు చూసి కొత్త ఫైట్స్ డిజైన్ చేయండి రొటీన్ ఫైట్స్ లేకుండా అని చెప్పాను. దానికి తగ్గట్టే కొత్తగా ఫైట్స్ డిజైన్ చేసారు. చివర్లో బురదలో పడిపోతాను. రాత్రి పూట చలికాలంలో షూటింగ్. రాత్రి 9 తర్వాత ఆ సీన్ చేసారు. రెండు గంటల పాటు బురదలోనే ఉన్నాను ఆ సీన్ కోసం. బాగా చలి వేసింది, బాడీ మొత్తం వణికిపోయింది. అయినా అలాగే చేశాను ఆ సీన్. ఈ సినిమా కోసం సంవత్సరం పాటు డైట్ మెయింటైన్ చేశాను. రోజూ జిమ్ చేసేదాన్ని. కుదరకపోతే సెట్స్ కి లోనే జిమ్ చేసేదాన్ని, సెట్ అంతా వాకింగ్ ఒక రౌండ్ వేసేదాన్ని అని తెలిపారు. దీంతో ఒక సినిమా కోసం ఈ వయసులో విజయశాంతి ఇంత కష్టపడుతుంది అంటే ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : Chiranjeevi : చిరంజీవి ఇంట్లో ఇంత అద్భుతమైన పూజా మండపం.. తయారుచేసింది ఎవరో తెలుసా..?