Chiranjeevi : చిరంజీవి ఇంట్లో ఇంత అద్భుతమైన పూజా మండపం.. తయారుచేసింది ఎవరో తెలుసా..?
చిరంజీవి కోసం ఇంత అద్భుతంగా పూజ మండపం చేసింది ఎవరో తెలుసా?

Do Yo Know Who Makes Special Pooja Mandapam in Megastar Chiranjeevi Home
Chiranjeevi : ఇటీవల అందరి ఇళ్లలోనూ పూజ గది ప్రత్యేకంగా ఉంటుంది. తమ స్థాయికి తగ్గట్టు దేవుడికి ప్రత్యేకంగా మండపం, గది చేయించుకుంటున్నారు. సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా పూజ గదులు గొప్పగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పూజ గదిలో ఉండే మండపం ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చిరంజీవి కానీ, చిరంజీవి ఇంటి సభ్యులు పూజలు చేసినప్పుడు తమ పూజ ఫోటోలు, పూజ గది ఫోటోలు అనేక మార్లు సోషల్ మీడియాలో షేర్ చేసారు. చిరంజీవి ఇంట్లో పూజ గదిలో మధ్యలో వెండితో అద్భుతంగా చేసిన పూజా మండపం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పూజ మండపం చూసి ఎంత బాగుందో అని అందరూ అనుకున్నారు. మరి వెండితో చిరంజీవి కోసం ఇంత అద్భుతంగా పూజ మండపం చేసింది ఎవరో తెలుసా?
Also Read : Theaters : టాలీవుడ్ కి షాక్.. మళ్ళీ మూత పడనున్న థియేటర్స్.. అల్టిమేటం జారీ చేసిన ఎగ్జిబిటర్లు..
చిరంజీవి ఇంట్లో పూజ మండపం చేసింది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి. ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన ఆనంద్ సాయి ఆ తర్వాతి కాలంలో స్థపతిగా మారి ఆలయ నిర్మాణాల్లో భాగం అయ్యారు. యాదాద్రి టెంపుల్ కూడా ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్ గా దగ్గరుండి కట్టించారు. అలాంటి ఆనంద్ సాయికి చిరంజీవి పిలిచి తన ఇంట్లో వెండితో ప్రత్యేక పూజ మండపం తయారుచేయమని అడిగాడట.
అన్నయ్య అడగ్గానే కొన్ని డిజైన్స్ గీసి చూపించడంతో చిరు ఫైనల్ చేసిన డిజైన్ ని మండపంలా తయారుచేయించారు ఆనంద్ సాయి. అలాగే ఆ పూజ రూమ్ ని కూడా ఆనంద్ సాయి డిజైన్ చేసారు. ఆనంద్ సాయి చిరంజీవి ఇంట్లోకి తయారుచేసిన పూజా మండపంతో దిగిన ఫోటోని గతంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. చిరంజీవి ఇంట్లో పూజ గది, పూజ మండపం గురించి అందరూ పొగుడుతున్నారు అంటే అది ఆనంద్ సాయి పనితనమే.
Also Read : Mad Square : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?