Mad Square : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.

Mad Square : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?

Narne Nithin Mad Square ott release date fix

Updated On : April 22, 2025 / 12:17 PM IST

నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కింది. 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుని బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి శుభ‌వార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.

ఈ చిత్రాన్ని ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో భాష‌ల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది.

Anand Sai – Pawan Kalyan : ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే.. 15 రోజులు కాల్ చేయలేదు.. కానీ యాక్సిడెంట్ అవ్వగానే..

శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ల పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్, రెబా మోనికా జాన్, సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్.. పలువురు ముఖ్య పాత్రల్లో న‌టించారు.