Anand Sai – Pawan Kalyan : ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే.. 15 రోజులు కాల్ చేయలేదు.. కానీ యాక్సిడెంట్ అవ్వగానే..
ఆనంద్ సాయి పవన్ తో తన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ..

Anand Sai Tells about his Close Friendship with Pawan Kalyan
Anand Sai – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో చెప్పుకొచ్చాడు. వారిద్దరూ ఎంత దగ్గరయ్యారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిపాడు.
ఆనంద్ సాయి పవన్ తో తన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ.. చెన్నైలో ఇద్దరం కలిసి టెంపుల్స్ తిరిగేవాళ్ళం. 18 ఏళ్ళ వయసు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఇద్దరికీ దేవుడి భక్తి ఉండేది. ఇద్దరికీ ఫ్రెండ్స్ లేరు. అలా క్లోజ్ అయ్యాము. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్తే అప్పటి రోజులు గుర్తు చేసుకుంటాం. ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మేము. ఫ్రెండ్స్ లెవల్ దాటేశాం. ఆయన ఏ గుడికి వెళ్లినా అందరి కోసం మొక్కుకుంటాడు ఆయన గురించి తప్ప. నేను గుడికి వెళ్తే ఆయన ఒక్కరి గురించే మొక్కుకుంటా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఫ్రెండ్ గా దొరకడు.
Also Read : Anand Sai : నా కోసం పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గరకు వెళ్లి.. పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి..
రోజూ మాట్లాడుకుంటేనే, కలిసి ఉంటేనే ఫ్రెండ్స్ కాదు. మేము మాట్లాడుకోకుండా కూడా చాలా రోజులు ఉంటాము ఎవరి పనుల్లో వాళ్ళు. మా ఫ్రెండ్షిప్ ఎంతలా అనేదానికి ఒక సంఘటన చెప్పొచ్చు. రెండేళ్ల క్రితం ఒక 15 రోజులు మేమిద్దరం మాట్లాడుకోలేదు, కాల్స్ చేయలేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. నేను చెన్నైలో బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. కొంచెం పెద్ద దెబ్బలే తగిలాయి. హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. 15 రోజులు కాల్స్ చేయలేదు కానీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఆయన కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే.. నీకు అంతా ఓకేనా, నీకేదో అయిందనిపించింది అన్నాడు. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాను. వెంటనే వచ్చేసాడు. అలా ఉంటుంది మా కనెక్షన్. ఇలాంటివి మా ఇద్దరి మధ్య చాలా ఉన్నాయి. మేము ఎక్కడా ఉన్నా మా గురించి ఆలోచిస్తాము. మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి అని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ ఇది కదా రియల్ ఫ్రెండ్షిప్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏ పాటలు వింటాడో తెలుసా? ఆనంద్ సాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతారు..