Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏ పాటలు వింటాడో తెలుసా? ఆనంద్ సాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతారు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి పవన్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ ఎలాంటి పాటలు వింటాడో తెలిపాడు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏ పాటలు వింటాడో తెలుసా? ఆనంద్ సాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతారు..

Do you know which songs Pawan Kalyan listens to the most Anand Sai Reveals

Updated On : April 21, 2025 / 5:09 PM IST

Pawan Kalyan : ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. ప్రస్తుతం ఆనంద్ సాయి సినిమాలు వదిలేసి ఆలయాల నిర్మాణంలో స్థపతిగా చేస్తున్నారు. ఇటీవలే కూటమి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్ కూడా అయ్యారు. రెగ్యులర్ గా పవన్ తో కనిపిస్తున్నారు ఆనంద్ సాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి పవన్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ ఎలాంటి పాటలు వింటాడో తెలిపాడు.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ఇప్పటికి ఎన్ని సార్లు వాయిదా పడిందో తెలుసా? ఇది కూడా రికార్డ్ అంటున్న ఫ్యాన్స్.. మళ్ళీ వాయిదా..?

ఆనందసాయి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఘంటసాల పాటలు వింటారు. అలాగే MS సుబ్బలక్ష్మి, సిర్కాజి గోవిందరాజన్, సూలమంగళం సిస్టర్స్ పాడిన దేవుడి పాటలు, తమిళ పాటలు వింటాడు. ఒకప్పటి తమిళ్ హీరో MGR సాంగ్స్ వింటాడు. ఆయన పాటల్లో మంచి మెసేజెస్ ఉంటాయని వింటాడు. ఒక్కోసారి ఇద్దరం కలిసి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తాము. మేము చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి వీధికి ఒక గుడి, ఆ గుడిలో పాటలు వినే అలవాటు మా ఇద్దరికీ ఉండేది. అలా దేవుడి పాటలు బాగా వింటాము. అప్పట్లో సినిమా సాంగ్స్ బుక్స్ వచ్చేవి. ఆ బుక్స్ కొనుక్కొని అవి చూసి పాడేవాడు కళ్యాణ్ అని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ పాత పాటలు అన్ని వింటారా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Also Read : Anand Sai : నా కోసం పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గరకు వెళ్లి.. పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి..