Theaters : టాలీవుడ్ కి షాక్.. మళ్ళీ మూత పడనున్న థియేటర్స్.. అల్టిమేటం జారీ చేసిన ఎగ్జిబిటర్లు..
తాజాగా మరోసారి థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామని అంటున్నారు.

East Godavari Exhibitors Warning on Shutdown Movie Theaters
Movie Theaters : గత కొన్నాళ్లుగా సినిమా థియేటర్స్ సమస్యల్లోనే ఉన్నాయి. థియేటర్ కి వచ్చి సినిమా చూసే జనాలు తగ్గిపోయారు. టికెట్ రేట్లు పెంచడం, మంచి కంటెంట్ లేని సినిమాలు రావడం, త్వరగా ఓటీటీలోకి రావడం.. లాంటి పలు కారణాలు కూడా జనాలను థియేటర్స్ కి రాకుండా చేస్తున్నాయి. ఆల్రెడీ కరోనా సమయంలో ఆ తర్వాత కొన్ని రోజులు థియేటర్స్ మొత్తానికే క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామని అంటున్నారు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్. తాజాగా ఈస్ట్ గోదావరి థియేటర్ ఓనర్లు మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం రెంటల్ విధానంలో సినిమాలు రిలీజ్ చేస్తుండగా అది పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేయాలని, వారికి రెంట్ కాకుండా సినిమా ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ ని, నిర్మాతలని డిమాండ్ చేసారు.
Also Read : Mad Square : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?
థియేటర్స్ కి వచ్చే జనాలు తగ్గిపోయారు, కేవలం కొన్ని పెద్ద సినిమాలకే వస్తున్నారు. దాంతో ఎక్కువ షోలు పడట్లేదు, షోలు పడక రెంట్స్ కూడా రావట్లేదు. అందుకే రెంటల్ విధానంలో కాకుండా ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ విధానంలో సినిమాలు రిలీజ్ చేయాలని ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని డిమాండ్ చేసారు.
దీనికి ఒప్పుకోకపోతే జూన్ 1 నుంచి ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని థియేటర్స్ మూసివేస్తామని అల్టిమేటం జారీ చేసారు. మరి దీనిపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ స్పందిస్తారా లేదా థియేటర్స్ నిజంగానే మూసేస్తారా చూడాలి. ఇది చూసి మిగిలిన ఏరియాలలో కూడా దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారని సమాచారం.
Also See : Thudarum Telugu Trailer : ఆకట్టుకుంటున్న ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్