Vijayashanthi Interesting Comments on Present Heroine Characters in Movies
Vijayashanthi : విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని ఇటీవలే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించి మెప్పించారు. మరోసారి పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది విజయశాంతి. తాజాగా విజయశాంతి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి హీరోయిన్స్ లో మీకు ఎవరి నటన అంటే ఇష్టం అని అడగ్గా విజయశాంతి మాట్లాడుతూ.. ఇప్పటి హీరోయిన్లకు సినిమాల్లో ఇచ్చేదే రెండు పాటలు, రెండు సీన్లు. పాపం వాళ్ళు అందులో బాగా చేయలేదని ఏం అంటాం. అందులో ఏం విశ్లేషిస్తాం. ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చినప్పుడే వారి నటన గురించి విశ్లేషించొచ్చు అని అన్నారు. దీంతో విజయశాంతి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Sunitha : సింగర్ ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. తను ఓటమిని తీసుకోలేకపోతుంది అంటూ..
అయితే విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కూడా హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్ర అలాంటిదే. ఓ పాట, కొన్ని సీన్స్ లో మాత్రమే హీరోయిన్ కనిపించడం గమనార్హం.