Vijayashanthi : రవితేజ సినిమాకి నో చెప్పిన విజయశాంతి.. ఆసక్తికర విషయం చెప్పిన అనిల్ రావిపూడి..
అనిల్ రావిపూడి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Vijayashanthi Rejects Raviteja Movie Anil Ravipudi Tells interesting Information
Vijayashanthi : ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కమర్షియల్ సినిమాలతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు విజయశాంతి. సినిమాలు మానేసాక రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చేస్తుంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి, అనిల్ రావిపూడి, సుమ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా మొదట ఒప్పుకోలేదు. చాలా సార్లు విజయశాంతి గారి వెనకాల తిరిగి కథ చెప్పి ఒప్పించాను. కానీ అంతకంటే ముందే రవితేజ సినిమాకు కూడా ట్రై చేశాను. రాజా ది గ్రేట్ సినిమాలో ముందు విజయశాంతి గారే అనుకున్నాను. అప్పుడు కూడా ట్రై చేశాను కానీ నో చెప్పారు. లక్కీగా మహేష్ బాబు సినిమాకి ఓకే చెప్పారు అని తెలిపాడు.
రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తల్లి పాత్రలో రాధిక నటించింది. ఆ పాత్రని అనిల్ రావిపూడి ముందు విజయశాంతిని అనుకున్నా ఆమె ఒప్పుకోకపోవడంతో రాధిక చేసారు. అలా విజయశాంతి రవితేజ సినిమాకు నో చెప్పింది. కానీ కాస్త లేట్ అయినా మహేష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సరసన నటిస్తున్నారు విజయశాంతి. ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా సినిమాలు చేస్తారా లేదా చూడాలి.