Vijayendra Prasad Penning The Story Of Razakars
Vijayendra Prasad: టాలీవుడ్ సీనియర్ రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా గుర్తింపును తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ఎలాంటి కథలను అందిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈయన రాసిన కథలకు జనాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. బాహుబలి, బజరంగీ భాయిజాన్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించగా, ఆ సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి తన కొడుకు అయిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నాడు ఈ స్టార్ రచయిత.
Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
ఇక తాజాగా రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ నామినేట్ అయినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్‌కు సంబంధించి టాలీవుడ్‌లో సరికొత్తగా ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సెన్సేషనల్ రైటర్, రాజమౌళి-మహేష్ బాబు మూవీకి కథను అందించడంతో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి కూడా కథలను రెడీ చేస్తున్నాడట. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై దమణకాండ సాగించిన రజాకార్లపై కథను రెడీ చేస్తున్నారట విజయేంద్ర ప్రసాద్. రజాకార్ల అరాచకాలను కళ్ళకు కట్టేలా మనకు చూపంచబోతున్నారట విజయేంద్ర ప్రసాద్.
Vijayendra Prasad : ‘ఆర్‌ఆర్‌ఆర్’కి సీక్వెల్ ఉంది.. కథ కూడా చెప్పాను
ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇక దీంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ బయోపిక్ కథను కూడా ఈ స్టార్ రైటర్ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రజాకార్ల అరాచకంపై ఆయన గతంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో రజాకార్ల అన్యాయాలు, అక్రమాలను ఆయన మనకు చూపించబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ మారింది.