VJ Sunny : బిగ్ బాస్ స్ర్రిప్టెడా? బిగ్ బాస్ సీక్రెట్స్ బయటపెట్టిన ఆ సీజన్ విన్నర్

బిగ్ బాస్‌లో ఉండే ఎమోషన్స్ మామూలుగా ఉండవు. అవన్నీ స్ర్రిప్టెడా? అని ఒక్కోసారి చూసేవారికి అనుమానం వస్తుంది. తాజాగా బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆ సీజన్ విన్నర్.

VJ Sunny

VJ Sunny : బిగ్ బాస్ చూస్తున్న అందరికి కామన్ గా కొన్ని డౌట్లు వస్తుంటాయి. బిగ్ బాస్ స్ర్రిప్టెడా? బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పినట్లు కంటెస్టెంట్లు బిహేవ్ చేస్తుంటారా? అని. తాజాగా బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ వీజే సన్నీ ఆ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడాడు.

భాష ఏదైనా బిగ్ బాస్ హౌస్‌లో అరుచుకోవడం.. కొట్టుకోవడం.. ఏడ్వడం.. లవ్, రొమాన్స్ ఇలా చాలా ఎమోషన్స్ చూస్తూ ఉంటాం. అయితే అదంతా నిజమేనా? లేక కొంత నిర్వాహకులు చెప్పినట్లు కంటెస్టెంట్లు చేస్తుంటారా? ఇదంతా స్క్రిప్టెడా? అనే డౌట్ వస్తుంటుంది చూసేవారికి. అయితే తాజాగా ఈ అంశాలపై తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు.

Bigg Boss 7 : ప్రియాంక కోసం ప్రియుడు బిగ్‌బాస్‌ ఎంట్రీ.. హౌస్‌లోనే పెళ్లి చేసుకుందామంటూ..

బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదన్నారు వీజే సన్నీ. డబ్బుల కోసం ఎవరూ క్యారెక్టర్ పోగొట్టుకోరని చెప్పారు. బిగ్ బాస్‌కి వచ్చే ప్రతి కంటెస్టెంట్ గుర్తింపు ఉన్నవారని ఎవరు విలువ పోగొట్టుకోరని అన్నారు. బిగ్ బాస్‌లో కనిపించేది అక్షరాల నిజమని ఆయన స్పష్టం చేశారు. బిగ్ బాస్‌లో ఇలా చేయండి.. అలా చేయండి అని ఎవరూ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వరని ఎవరి ఆట వారు ఆడతారని అన్నారు.

బిగ్ బాస్‌కి వచ్చే వారిని ఎవరు రికమండ్ చేయన్నారు వీజే సన్నీ. ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ల పేర్లు సజెస్ట్ చేయమని అడుగుతారని.. తను కూడా కొందరి పేర్లు సజెస్ట్ చేశానని అందులో కొందరు మాత్రమే హౌస్‌కి వెళ్లారని సన్నీ చెప్పారు. గెలుపుకోసం కంటెస్టెంట్లు పీఆర్‌లను పెట్టుకున్నా లోపల ఆడే కంటెస్టెంట్లలో ఎవరు జెన్యూన్ అని జనాలు నమ్ముతారో వాళ్లే టాప్‌లోకి వెళ్తారని స్పష్టం చేశారు. మొదటి సీజన్ షోకి వచ్చిన వారికి కాస్త టఫ్‌గా ఉండి ఉండొచ్చని తర్వాత సీజన్‌కి వచ్చిన కంటెస్టెంట్లు మాత్రం కాస్త అవగాహనతో వచ్చి ఆడుతున్నారని చెప్పారు. ఈ సీజన్‌లో శివాజీ చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారని అన్నారు వీజే సన్నీ.

Bigg Boss 7 Day 65 : బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్.. హౌస్ లోకి ఎవరెవరు వచ్చారంటే? ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 5 లో వీజే సన్నీ రెండో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లారు. 15 వారాలు .. వందరోజులకు పైనే హౌస్‌లో ఉన్నారు. శ్రీరామచంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ విజేతగా నిలిచారు. వీజే టీవీ, సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘కళ్యాణ వైభోగం’ అనే సీరియల్‌లో నటించి జయసూర్య అనే పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ ‘సకలగుణాభిరామ’ సినిమాలో హీరోగా నటించారు. తాజాగా సన్నీ నటించిన ‘సౌండ్ పార్టీ’ సినిమా నవంబర్ 24న విడుదల కాబోతోంది.