రామ లవ్స్ సీత వీడియో సాంగ్ ప్రోమో

రామ లవ్స్ సీత వీడియో సాంగ్‌ని పంజాబీ భాంగ్రా స్టైల్‌లో, వందలాది మంది డ్యాన్సర్లతో, కలర్ ఫుల్‌గా పిక్చరైజ్ చేసారు.

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 07:14 AM IST
రామ లవ్స్ సీత వీడియో సాంగ్ ప్రోమో

Updated On : January 7, 2019 / 7:14 AM IST

రామ లవ్స్ సీత వీడియో సాంగ్‌ని పంజాబీ భాంగ్రా స్టైల్‌లో, వందలాది మంది డ్యాన్సర్లతో, కలర్ ఫుల్‌గా పిక్చరైజ్ చేసారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ, జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెఢీ అయిపోయింది. డి.వి.వి.దానయ్య నిర్మించగా, కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. మొన్ననే సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరోవైపు మూవీ యూనిట్, ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు చరణ్ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న వీవీఆర్ టీమ్, రీసెంట్‌గా వినయ విధేయ రామ లోని రామ లవ్స్ సీత వీడియో సాంగ్ ప్రోమో‌ని రీలీజ్ చేసింది.

ఈ సాంగ్‌ని పంజాబీ భాంగ్రా స్టైల్‌లో, వందలాది మంది డ్యాన్సర్లతో, కలర్ ఫుల్‌గా పిక్చరైజ్ చేసారు. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్‌లో చరణ్, కైరా మెరిసి పోయారు. ఇక చరణ్ స్టెప్స్ అయితే, మెగాభిమానులను అలరించేలా ఉన్నాయి. ఈ ప్రోమోకి ఇప్పటి వరకు 2 మిలియన్లకి పైగా వ్యూస్ రావడం విశేషం.

వాచ్ సాంగ్ ప్రోమో…