Pekamedalu Trailer : ‘పేకమేడలు’ ట్రైలర్ చూశారా? భార్య సంపాదిస్తుంటే భర్త ఏం చేస్తున్నాడు అంటే..

ఇప్పటికే పేకమేడలు సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

Vinoth Kishan Rakesh Varre Pekamedalu Trailer Released

Pekamedalu Trailer : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ‘పేకమేడలు’. వినోద్ కిషన్ హీరోగా అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని నటుడు రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.

Also Read : Sindhooram Song : ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే..’ ఇంత గొప్ప పాట సినిమా కోసం ముందు రాయలేదా? సిగరెట్ పెట్టె మీద లిరిక్స్ రాసి..

ఇప్పటికే పేకమేడలు సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. పనిపాట లేకుండా జీవితంలో పగటి కలలు కంటూ భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జాబ్ లో జాయిన్ అయితే అక్కడ ఒక అమ్మాయి పరిచయమయితే తన లైఫ్ ఎలా మారింది? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకొచ్చాయి అనే ఆసక్తికర కథని కామెడీ, ఎమోషనల్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా పేకమేడలు ట్రైలర్ చూసేయండి..

 

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ జరగగా ఈవెంట్లో వినోద్ కిషన్ మాట్లాడుతూ.. తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా మంచి సపోర్ట్ ఇస్తుంది. సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఇక డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపించబోతున్నాం. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ నెల 19న సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ.. ఈ సినిమాకు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో ప్రమోషన్ చేస్తే అది పెద్ద సక్సెస్ అయింది. సినిమా రిలీజ్ వరకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం. ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవాళ్లు మగవాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్ తో మంచి కాన్సెప్ట్ ని చూపించాం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటుంది అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు