#ViralPicOfTheWeek: ఎన్టీఆర్-రామ్ చరణ్ నుంచి నయనతార వరకూ


సోషల్ మీడియాలో ఈ వారం టాలీవుడ్ ఇండస్ట్రీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. నయనతార ఓల్డ్ ఫొటో, ఎన్టీఆర్-రామ్ చరణ్ రాన్ డమ్ పిక్, అనుపమ పరమేశ్వరన్ మల్లెపూల ఫొటో, పెంపుడు కుక్కతో రవితేజ ఫొటో, సంప్రదాయ దుస్తుల్లో ప్రగ్యా జైస్వాల్, రష్మీ శారీ ఫొటో, జయలలిత షూటింగ్ ప్రారంభోత్సవంలో కంగనా రనౌట్, ప్రైవేట్ ఈవెంట్ లో నిత్యామీనన్, రకుల్ ప్రీత్ ఎడ్వర్టైజ్ మెంట్ ఇలా మరికొన్ని ఫొటోలు ట్రెండింగ్ గా మారి వైరల్ అయ్యాయి. 

RRR మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వెళ్తుండగా తీసిన ఫొటోను చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 

 

నయనతార పాత సినిమాల్లో డీ గ్లామర్ రోల్ లో ఉన్నప్పటి ఫొటో.. మెస్మరైజింగ్ చూపులతో చేతులు వెనక్కిపెట్టుకుని దిగిన పిక్ అది. 

 

అనుపమ పరమేశ్వరన్ హోమ్లీగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ ఏ డ్రెస్ లోనైనా ఇట్టే సరిపోతుంది. ఆ ఫిజిక్ కు సంప్రదాయ దుస్తులు అయితే మరింత ఇంపుగా ఉంటుంది. తానే ఫొటో దిగి జాస్మిన్ గర్ల్ అనే ట్యాగ్ తో ఫొటో పోస్టు చేసింది. 

 

డిస్కో రాజా రవితేజ తన పెంపుడు కుక్కతో ఆడుతూ ఉండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మూడు ఫొటోలను మూడు రకాల మోడ్ లలో సేవ్ చేసి అభిమానులతో పంచుకున్నారు. 

 

సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ హడావుడి తక్కువ లేదు. అడ్వర్టైజ్‌మెంట్ లతో బిజీగా సాగిపోతున్న ఈ భామ సంప్రదాయ దుస్తులతో ఫొజిచ్చిన ఫొటోను షేర్ చేసింది.