Kohli Biopic : మరోసారి బాలీవుడ్ టాక్.. కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్.. నిర్మాతలు చరణ్ ని అడిగారా?

బాలీవుడ్ నిర్మాతలు కోహ్లీ బయోపిక్ తెరకెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కోహ్లీ అభిమానులు కూడా ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారు.

Virat Kohli Biopic Ram Charan will Play Kohli Role News goes viral in Bollywood

Kohli Biopic : ఇటీవల సినీ పరిశ్రమలలో బయోపిక్స్(Biopics) ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా.. వివిధ రంగాల ప్రముఖుల బయోపిక్స్ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ బయోపిక్స్ ఎక్కువగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. ఇందులో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఎప్పట్నుంచో స్టార్ క్రికెటర్ కోహ్లీ(Virat Kohli) బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే క్రికెట్ కి సంబంధించి అనేక సినిమాలు, బయోపిక్స్ వచ్చాయి. అందులో MS ధోని(MS Dhoni) సినిమా ఒక్కటే భారీ విజయం సాధించింది.

బాలీవుడ్ నిర్మాతలు కోహ్లీ బయోపిక్ తెరకెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కోహ్లీ అభిమానులు కూడా ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లీ క్యారెక్టర్ కి సెట్ అయ్యే హీరో ఇప్పటిదాకా దొరకలేదని అనేవాళ్ళు. కానీ RRR సినిమా తర్వాత నుంచి కోహ్లీ బయోపిక్ లో చరణ్ నటిస్తాడని, చరణ్ అయితే బాగుంటుందని వార్తలు వస్తున్నాయి. కోహ్లీలాగా పర్ఫెక్ట్ బాడీ ఉందని, యాగ్రెసివ్, హ్యుమానిటీ.. అన్ని చరణ్ లో ఉన్నాయని, చరణ్ అయితే కోహ్లీ పాత్రకు సరిగ్గా సరిపోతాడని కామెంట్స్ చేశారు. గతంలో చరణ్ కూడా దీనిపై స్పందిస్తూ ఆ బయోపిక్ కి తనని ఇంకా ఎవరు అప్రోచ్ అవ్వలేదు అని అన్నాడు. తాజాగా మరోసారి కోహ్లీ బయోపిక్ లో చరణ్ నటించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Septimius Awards : ఇంటర్నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ ఆసియన్ యాక్ట్రస్ నామినేషన్స్‌లో రష్మిక.. యాక్టర్ నామినేషన్స్‌లో మలయాళం హీరో..

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఆ తర్వాత బుచ్చిబాబు సాన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ రామ్ చరణ్ ని కోహ్లీ బయోపిక్ కోసం సంప్రదించింది, చరణ్ ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదే కనక నిజమైతే చరణ్ ఆ సినిమా ఒప్పుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి కోహ్లీ బయోపిక్ లో ఎవరు నటిస్తారో?