Vishal Birthday Special Interview on Mark Antony Movie
Vishal Birthday : ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు నేడే ఆగస్ట్ 29. ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా మీడియాతో వివరించారు.
విశాల్ మాట్లాడుతూ.. ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నారు.
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఎంత ముద్దుగా పాడిందో.. మలయాళంలో ఓనమ్ పాట పాడిన అనుపమ..
ఇక ‘మార్క్ ఆంటోని’ సినిమా గురించి మాట్లాడుతూ.. నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్ తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తానని చెబుతున్నాను అని అన్నారు విశాల్.