Vishal : నాకు ఎలాంటి సమస్య లేదు.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను అనుకున్నారు.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ..

హీరో విశాల్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో బక్కగా కనిపించి, వణుకుతూ మాట్లాడటంతో ఆ వీడియో వైరల్ అయింది.

Vishal Gives Clarity on his Health in Madha Gaja Raja Movie Premiere Show

Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో బక్కగా కనిపించి, వణుకుతూ మాట్లాడటంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇలా అయిపోయాడేంటి, విశాల్ కి ఏమైంది అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. డాక్టర్స్ విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని, అందుకే అలా ఉన్నాడని ఓ బులెటిన్ కూడా రిలీజ్ చేసారు. కానీ వైరల్ ఫెవర్ కే ఇలా మారిపోతారా అని ఫ్యాన్స్, నెటిజన్లు ఎవ్వరూ నమ్మలేదు.

ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన విశాల్ మదగజరాజా సినిమా నేడు రిలీజయింది. నిన్న రాత్రి ఈ షో ప్రీమియర్స్ కి విశాల్ వెళ్లారు. అప్పుడు విశాల్ బాగానే ఉన్నారు. ఆరోగ్యంగానే కనిపించారు. ప్రీమియర్ షో అయిన తర్వాత విశాల్ మాట్లాడారు.

Also Read : Anil Ravipudi : స్టార్ హీరో సినిమా డైరెక్ట్ చేయమని ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి.. తమిళ పరిశ్రమలో చర్చ..

విశాల్ మాట్లాడుతూ.. మా నాన్న వల్లే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవల కొంతమంది నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళను. నాకు ఎలాంటి సమస్య లేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఇప్పుడు నా చేతులు కూడా వణకట్లేదు. మైక్ కూడా కరెక్ట్ గానే పట్టుకున్నాను. నా మీద మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీ అభిమానాన్ని చివరివరకు మర్చిపోను. మీ ప్రార్థనలు నన్ను త్వరగా కోలుకునేలా చేసాయి అని తెలిపారు.

దీంతో విశాల్ స్పీచ్ వైరల్ గా మారింది. విశాల్ ఆరోగ్యంగా కనపడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగువాడైనా విశాల్ తమిళ్ లో వరుస సినిమాలతో హీరోగా ఎదిగాడు. ఇక్కడ తెలుగులో కూడా తన డబ్బింగ్ సినిమాలతో మెప్పించి మంచి మార్కెట్ తెచ్చుకున్నాడు. విశాల్ హీరోగా నటించిన మదగజరాజా సినిమా 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ అయింది. విశాల్ గత సినిమాలు మార్క్ ఆంటోనీ పెద్ద హిట్ అవ్వగా, రత్నం సినిమా మాత్రం పరాజయం పాలైంది. ఇప్పుడు మదగజరాజ సినిమా కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేసారు.

Also Read : Game Changer Piracy : ‘గేమ్ ఛేంజర్’కు షాక్.. ప్రైవేట్ బస్సుల్లో పైరసీ షో..