Vishal Mark Antony Movie releasing on September 15th clearance from Court
Mark Antony Movie : హీరో విశాల్(Vishal) ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా, సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.
అయితే విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. లైకా నిర్మాణ సంస్థకి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో కోర్టుని ఆశ్రయించగా హైకోర్టుని కేసు విచారించి సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చింది. సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చి నేడు 12వ తారీఖున వాయిదా ఉండగా నేడు కోర్టులో విచారణ అనంతరం తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.
O Saathiya : 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్‌తో.. అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘ఓ సాథియా’
దీనిపై విశాల్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. హిందీలో మాత్రం 22న విడుదల కానుంది అని ట్వీట్ చేశారు. ఇక ఇప్పటీకే మార్క్ ఆంటోని టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి.
No objection in court to release the movie #MarkAntony, Stay vacated.#MarkAntony all set to release on Sep 15th Worldwide and 22nd in Hindi, GB#MarkAntonyFromSep15#WorldOfMarkAntony pic.twitter.com/4eXj0Og7Y8
— Vishal (@VishalKOfficial) September 12, 2023