మే 10న విడుదల కానున్న అయోగ్య

విశాల్ నటించిన తమిళ టెంపర్ రీమేక్ - అయోగ్య మే 10న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 05:37 AM IST
మే 10న విడుదల కానున్న అయోగ్య

Updated On : May 4, 2019 / 5:37 AM IST

విశాల్ నటించిన తమిళ టెంపర్ రీమేక్ – అయోగ్య మే 10న విడుదల కానుంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ టెంపర్, తమిళనాట రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాందించుకున్న యంగ్ హీరో విశాల్, తమిళ్ టెంపర్ రీమేక్‌అయోగ్యలో నటిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌.. లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై, ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్‌ అండ్  ట్రైలర్‌కిమంచి రెస్పాన్స్ వస్తుంది. దాదాపు తెలుగు వెర్షన్‌నే ఫాలో అయిపోతూ, తమిళ నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసి, అయోగ్యని తెరకెక్కించారు.

ఇక్కడ ఎన్టీఆర్ దయగా కనిపిస్తే, అక్కడ విశాల్ కర్ణగా కనిపించనున్నాడు. విశాల్ మాస్ యాక్షన్, ఫైట్స్, అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సీనియర్ నటుడు ఆర్.పార్థిబన్ చేస్తుండగా, పోసాని క్యారెక్టర్‌లో, ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ నటిస్తున్నాడు. సినిమాని మే 10న రిలీజ్ చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. సోనియా అగర్వాల్, పూజా దేవరియా, యోగిబాబు, ఆనంద్ రాజ్, ఎమ్.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : సామ్ సిఎస్, కెమెరా : విఐ కార్తీక్, ఎడిటింగ్ : రూబెన్, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఆర్ట్ : ఎస్.ఎస్.మారుతి.

వాచ్ అయోగ్య ట్రైలర్..