Vishnu Vishal : ఆ వ్యాధితో బాధపడుతున్నాను.. అందుకే ఇలా.. హీరో పోస్ట్ వైరల్..

తాజాగా ఈ నటుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.(Vishnu Vishal)

  • Published on- June 25, 2026 / 07:36 PM IST

Vishnu Vishal

Vishnu Vishal : తమిళ నటుడు విష్ణు విశాల్ పలు తెలుగు సినిమాల్లో నటించి, తన సినిమాలను ఇక్కడ కూడా డబ్బింగ్ తో రిలీజ్ చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాని పెళ్లి చేకోవడంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. త్వరలో విష్ణు విశాల్ గట్ట కుస్తీ సీక్వెల్ తో రాబోతున్నాడు. తాజాగా ఈ నటుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

విష్ణు విశాల్ తన పోస్ట్ లో.. ఈ విషయాన్ని మీతో స్వయంగా పంచుకోవాలని అనుకున్నాను. నా హెల్త్ గురించి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించే ఉంటారు. దీనికి కారణం గత 3-4 ఏళ్లుగా నేను ఒక ‘ఆటో ఇమ్యూన్’ (autoimmune) అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దీని కోసం నేను అప్పుడప్పుడు వాడుతున్న మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ముఖం ఉబ్బినట్లు ఉండే సమస్య కూడా అందులో ఒకటి. దీనికి చికిత్స చాలా అవసరం, నా ఆరోగ్యానికే నేను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

అయినా మీ ప్రేమ, నేను నమ్మే ఈ సినిమా పని వల్ల ‘గట్ట కుస్తీ 2 కోసం అవిశ్రాంతంగా పనిచేసాను. నా ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. నా ఆరోగ్యం పట్ల మీరు చూపించిన ఆందోళనకు ధన్యవాదాలు. జూలై 3న థియేటర్లలో ‘గట్ట కుస్తీ 2’ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేయాలి అని తెలిపారు.

Also Read : Deepa Thomas : మహేష్ బాబు పొగిడిన ‘దీపా థామస్’ ఎవరు? తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటి..

దీంతో విష్ణు విశాల్ ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు తాను త్వరగా కోలుకోవాలని, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొవాలని కోరుకుంటున్నారు. విష్ణు విశాల్ – ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన గట్ట కుస్తీ కామెడీ యాక్షన్ జానర్ తో ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ తో వస్తున్నారు. ఈ సినిమా తెలుగులో మట్టి కుస్తీ పేరుతో వచ్చి ఇక్కడ కూడా మోస్తరు విజయం సాధించింది.