Vishnupriya Sensational Comments on Nabeel Afridi in Bigg Boss
Bigg Boss 8 : బిగ్ బాస్ మూడో వారం సాగుతుంది. హౌస్ లో ఇచ్చే టాస్కుల్లో కంటెస్టెంట్స్ రెండు టీమ్స్ గా పోరాడుతున్నారు. అయితే నిన్న కంటెస్టెంట్స్ కి గుడ్లు సేకరించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓ పెద్ద కోడి బొమ్మని తీసొకొచ్చి అది ఇచ్చే గుడ్లు సేకరించాలని బిగ్ బాస్ చెప్పడంతో రెండు టీమ్స్ గుడ్ల కోసం పోరాడాయి. ఈ క్రమంలో కొట్టుకునే దాకా, లాక్కునే దాకా వెళ్లారు. దీంతో రెండు టీమ్స్ మధ్య గొడవలు అయ్యాయి.
కంటెస్టెంట్స్ అందరూ గుడ్ల కోసం పోరాడుతుండటంతో ఒకరిపై ఒకరు పడి, ఒకరి దగ్గర్నుంచి ఒకరు లాక్కోడం, పక్కనోళ్ళని తోసేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నబిల్ విష్ణుప్రియని లాగడం చేసాడు. విష్ణుప్రియ దగ్గర గుడ్లు లాక్కోడానికి ప్రయత్నించాడు. దీంతో విష్ణుప్రియ తనని నబిల్ అభ్యంతకరంగా టచ్ చేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి నబిల్ సమాధానమిస్తూ.. నేను గేమ్ లో భాగంగా గుడ్లు తీసుకోడానికి మాత్రమే ప్రయత్నించాను అని, అనవసరంగా నిందలు వేయొద్దని ఫైర్ అయ్యాడు.
Also Read : Devara Musical Nights : ‘దేవర’ మ్యూజికల్ ఈవెంట్స్.. ఆ నాలుగు సిటీల్లో..
అయితే ఈ గేమ్ లో చివరగా శక్తి టీమ్ 66 గుడ్లు సేకరిస్తే, కాంతార టీమ్ 34 గుడ్లు సేకరించింది. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని గేమ్ నుంచి సేడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ ఛాన్స్ తో శక్తి టీమ్ నబీల్‌ను గేమ్ నుంచి పంపించేయడం గమనార్హం.