Rakul – Vishwak Sen : ‘పాగల్’ తో రకుల్..

పాంథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించనున్న ఈ సిరీస్‌లో రకుల్, విశ్వక్ సేన్ జంటగా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..

Rakul – Vishwak Sen : ‘పాగల్’ తో రకుల్..

Vishwak Sen And Rakul Preet Singh Web Series

Updated On : June 29, 2021 / 4:13 PM IST

Rakul – Vishwak Sen: ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. డిఫరెంట్ సినిమాలతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ వీరిద్దరి కాంబో సెట్ చేశారు.

కంగనా రనౌత్ మెయిన్ లీడ్‌గా విజయ్ డైరెక్ట్ చేసిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. తర్వాత విజయ్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. పాంథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించనున్న ఈ సిరీస్‌లో రకుల్, విశ్వక్ సేన్ జంటగా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న రకుల్.. కథ, క్యారెక్టర్ నచ్చితే స్టార్ హీరోనా, చిన్న హీరోనా, సినిమానా, ఓటీటీనా అని చూడట్లేదు. వచ్చిన ఆఫర్స్‌ని అందిపుచ్చుకుంటోంది. క్రిష్ డైరెక్షన్లో ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ పక్కన కూడా యాక్ట్ చేసింది రకుల్.. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో నటించబోతుండడంతో విజయ్ ప్లాన్ చేస్తున్న వెబ్ సిరీస్ మీద హైప్ క్రియేట్ అవుతోంది.