Vishwak Sen : ఎవ్వరూ ఏమి పీకలేరు.. నేను ఇలాగే మాట్లాడతా.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్..

మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

Vishwak Sen Comments on Mechanic Rocky Pre Release event goes Viral

Vishwak Sen : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిన్న వరంగల్ లో మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ పై కౌంటర్లు వేస్తూ వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమా తర్వాత అసలు వాళ్ళను పట్టించుకోను అని అన్నాడు.

మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మీకే చెప్తున్నా. మీరు నన్ను ఏమి పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా. ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా. నేనేమి తప్పు చెయ్యట్లేదు. సినిమాలు చేస్తున్నాము. నేను ట్రోల్ చేసిన వాళ్ళను, నా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను నేనేమి అనను. ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడను. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా ఏం కామెంట్ చేసినా పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయొద్దని కోరుతున్నా. క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Also See : Pushpa 2 Trailer Launch event : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

దీంతో విశ్వక్ సేన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో పలువురు విశ్వక్ కి యాటిట్యూడ్ ఎక్కువ అని మాట్లాడుతూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటికి కౌంటర్ గానే విశ్వక్ ఇలా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి విశ్వక్ మాటలు వైరల్ అవ్వగా మెకానిక్ రాకీ సినిమాపై ట్రోలర్స్, యూట్యూబ్, ట్విట్టర్ రివ్యూల బ్యాచ్ లు ఎలా స్పందిస్తాయో చూడాలి.