Devara : దేవర అప్డేట్ ఇచ్చిన విశ్వక్ సేన్.. దేవర మ్యూజిక్ ఉందమ్మా..

లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పార్టీ. ఆ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్..

Devara : కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్ ని వినిపించినట్లు తెలుస్తుంది. దీంతో విశ్వక్ సేన్ ఆ పాటలు గురించి మాట్లాడుతూ ఓ పోస్ట్ వేశారు. “దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే. అనిరుద్ ఇరగొట్టేసాడు. ఈ ఆల్బమ్ ప్రతిఒక్కరికి నచ్చేస్తుంది” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Allu Ayaan : అల్లు అయాన్ బర్త్‌డే.. హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ బన్నీ అభిమానుల పోస్టులు వైరల్..

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి పార్టుని దసరా సమయంలో అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు