×
Ad

Vishwak Sen : విశ్వక్ ఎంత మంచోడో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేసే ముందు తరుణ్ తో ఏమని చెప్పాడో తెలుసా?

ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ కూడా ప్రకటించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.(Vishwak Sen)

Vishwak Sen

Vishwak Sen : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని మెప్పించింది. ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ కూడా ప్రకటించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.(Vishwak Sen)

ENE రిపీట్ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఈ సీక్వెల్ లో నటిస్తున్నా సాయి సుశాంత్ రెడ్డి ప్లేస్ లో శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో థాయిలాండ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్టు టాక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Pawan Kalyan : జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్.. వైజాగ్ జూ పార్క్ లో పవన్.. ఫొటోలు..

ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నగరానికి ఏమైంది 2 రాయడానికి ముందే విశ్వక్, అభినవ్, వెంకీ నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. విశ్వక్ సేన్ నాతో తరుణ్… మళ్లీ పాత రోజులకి వెళ్దాం. ఈ నగరానికి ఏమైంది సమయంలో మనకు క్యారవాన్ కూడా లేదు. ఇప్పుడు నలుగురికి ఒక్క క్యారవాన్ ఇచ్చినా సరిపోతుంది. మళ్లీ కష్టపడదాం. అప్పట్లో ఏ ఆకలితో చేశామో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. ఎవరికెంత అని ఆలోచించకు. నీకు వచ్చినట్టు స్క్రిప్ట్ రాయి. ఇది స్క్రిప్ట్ అని చెప్పు, మేము వచ్చి చేస్తాం అని చెప్పినట్టు తెలిపాడు.

దీంతో సినిమా బాగా రావడానికి విశ్వక్ తరుణ్ ని ఎంత నమ్మాడు, కెరీర్ మొదట్లో ఎలా ఉన్నాడో అలాగే చేద్దామనడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. త్వరలో షూటింగ్ మొదలవనున్న ఈ నగరానికి ఏమైంది సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Om Shanti Shanti Shantihi : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..